YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు మిర్చియార్డు పునఃప్రారంభంపై మంత్రి సమీక్ష

గుంటూరు మిర్చియార్డు పునఃప్రారంభంపై మంత్రి సమీక్ష

గుంటూరు మిర్చియార్డు పునఃప్రారంభంపై మంత్రి సమీక్ష
గుంటూరు మే 19
గుంటూరు మిర్చియార్డులో క్రయ విక్రయాల పునఃప్రారంభం అంశంపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కన్నబాబు అధికారులతో సమీక్షించారు. మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులు, ట్రేడర్‌లు, కమిషన్‌ ఏజెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డులో క్రయ విక్రయాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ 4.0 సడలింపుల నేపథ్యంలో మిర్చియార్డులో నిబంధనలు పాటిస్తూ పరిమిత సిబ్బందితో క్రయవిక్రయాలకు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముందుగా శాంపిల్‌ బేస్‌ మీద కొద్దికొద్దిగా క్రయ విక్రయాలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా పలువురు అధికారులు మంత్రికి సూచించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మార్కెట్‌ యార్డుల్లో వికేంద్రీకరణ పద్ధతిలో క్రయ విక్రయాలకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Related Posts