తల్లీకొడుకుల జీవితాలను చిదిమేసిన టిక్టాక్..!
విజయవాడ మే 19
టిక్టాక్ యాప్ తల్లీకొడుకుల జీవితాలను చిదిమేసింది. ఇది ఆడపిల్లలకు తల్లి, సోదరున్ని దూరం చేసింది. అదే పనిగా టిక్టాక్ చేస్తోందని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మృతిని జీర్ణించుకోలేక వారి తనయుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విజయవాడలోని వైఎస్సార్ కాలనీలో చోటు చేసుకుంది. టిక్టాక్ చేయవద్దని భర్త మండలించడంతో నిన్న రాత్రి ఓ భార్య సూసైడ్ చేసుకుంది. భార్యను హాస్పటల్కు తరలించేలోగా ఆమె మృతి చెందింది. తల్లి మరణవార్తను జీర్ణించుకోలేని ఆమె కుమారుడు సైతం ఈ రోజు ఉదయం సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలికి ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లీకొడుకులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.