విశాఖ పోలీసు కమిషనర్ ని వెంటనే స్పండ్ చేయాలి
ఐహెచ్ఆర్ఏ డిమాండ్
గుంటూరు మే 19
డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా వ్యవహరించిన విశాఖ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్(ఐహెచ్ఆర్ఏ) డిమాండ్ చేసింది. ఇందుకు నైతిన భాద్యత వహిస్తూ విశాఖా పోలీసు కమిషనర్ ని సస్పెండ్ చేయాలని అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.ఈ నెల 16న విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారని, ఆయన దుస్తులు ఊడదీసి, అర్ధనగ్నం చేసి, తాళ్లతో చేతులు వెనక్కికట్టి రోడ్డుపై పడుకోబెట్టి అమానవీయంగా వ్యవహరించారన్నారు. నర్సీపట్నం ప్రాథమిక వైద్య కేంద్రంలో మాస్కులు లేకపోవడం పట్ల డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం దృస్టికి తీసుకవచ్చారని దానిని జీర్ణించుకోలేక అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని తిరుపతి నాయుడు పేర్కొన్నారు. ఆయన మానసికంగా బాధపడుతున్నాడని, మద్యానికి బానిస అని రకరకాలుగా ప్రచారం చేయడం వెనుక కుట్ర దాగిఉందన్నారు.ఒక ప్రభుత్వ డాక్టర్ ను తాళ్ళతో కట్టి రోడ్డు పై పడుకోబెట్టి అవమానించారని,ఇది దారుణమన్నారు. ఈ దారుణాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించడం అభినందనేయమన్నారు. బాధ్యులైన పోలీసులపై ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కింద పోలీసులపై కేసు నమోదు చేయాలని నాయుడు డిమాండ్ చేశారు.అలాగే డాక్టర్ సుధాకర్ పై దాడిని నిరసిస్తూ మంత్రి వర్గం లోని ఎస్సి,ఎస్టి మంత్రులు వెంటానే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దీనిని బట్టి చూస్తే రాష్ట్రం లో ఆటవిక పాలన సాగుతుందన్నది స్పస్టం అవుతుందన్నారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్న డాక్టర్ సుధాకర్ పట్ల అమర్యాదారరంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని హైకోర్ట్ ను కోరారు.