లాక్ డౌన్ సడలింఫు..హైదరాబాద్ లో తిరిగి జనకల
హైదరాబాద్ మే 20
వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో హైదరాబాద్ రోడ్లన్నీ వెలవెబోయాయి. ఎప్పుడూ చూడని పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది. దాదాపు రెండు నెలల తర్వాత మంగళవారం (మే 19వ తేదీ)తో హైదరాబాద్లో కొంత సాధారణ పరిస్థితి ఏర్పడింది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజా జీవనం యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు. కార్యాలయాలు చాలా వ్యాపారాలు కూడా తెరచుకోవడంతో హైదరాబాద్కు పూర్వ వైభవం వచ్చింది. ఒక్క ఆర్టీసీ మెట్రో రైల్కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆటోలు క్యాబ్లకు అనుమతి ఇవ్వడంతో రోడ్డెక్కాయి. సొంత వాహనదారులకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో హైదరాబాద్పై మళ్లీ ప్రజల సందడి కనిపించింది.