YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

చైనా కవ్వింపు చర్యలు..భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత

చైనా కవ్వింపు చర్యలు..భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత

చైనా కవ్వింపు చర్యలు..భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత
న్యూ ఢిల్లీ  మే  20
చైనా వక్రబుద్ధి మారడం లేదు. ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇప్పటికే ఆ మహమ్మారి వైరస్తో చైనాపై ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. చైనాను నిందిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశం నుంచి పరిశ్రమలు వివిధ కంపెనీలు అక్కడి నుంచి వెనక్కి వచ్చేలా చూస్తున్నారు. ఈ సమయంలో వారికి భారతదేశం అద్భుతంగా కనిపిస్తోంది. వారందరినీ భారత్ ఆకర్షిస్తుందనే ద్వేషంతో చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల సిక్కిం లడఖ్ సరిహద్దులో చైనా భారత్కు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనల్లో పలువురు సైనికులు కూడా గాయపడ్డారు. అయితే స్థానిక అధికారుల మధ్య చర్చల అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. తాజాగా మళ్లీ చైనాకు చెందిన మిలిటరీ విమానాలు నిషిద్ధ గగనతలంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. డ్రాగన్ సైన్యం గాల్వన్ నది సమీపంలో క్యాంప్లు ఏర్పాటుచేశాయి. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు అక్కడికి దూసుకెళ్లాయి. చైనా చర్యతో స్పందించిన భారత్ సరిహద్దుకు అదనపు బలగాలను పంపింది. దీంతో ఇరువైపులా బలగాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొదటి నుంచి సిక్కిం సరిహద్దు ప్రాంతంలో రెచ్చగొట్టే పనులు చేస్తుంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ అద్భుత శక్తిగా కనిపిస్తున్న సమయంలో ఈర్ష్యతో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వాస్తవంగా గాల్వన్ ప్రాంతం 1962 యుద్ధంలో కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. 2013 లో 21 రోజుల పాటు 2017 లో 73 రోజుల పాటు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. లడఖ్ సమీపంలోని పాంగాంగ్ లేక్ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల చర్చలతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరు దేశాలు సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. అప్పటినుంచి అక్కడ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Related Posts