YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణా లక్ష్యం నెరవేరడం లేదు

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణా లక్ష్యం నెరవేరడం లేదు

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణా లక్ష్యం నెరవేరడం లేదు
         ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి
హైదరాబాద్ మే 20రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణా లక్ష్యం నెరవేరడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డిఅన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో మీమేడియా సమావేశం లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం తెలంగాణ పోరాటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ లో యువత కు ఉద్యోగాలు రాలేదన్నారు.వేలాది మంది అనేక ఉన్నత చదువులు చడదువుకున్న కూడా ఉపాధి పనులు చేసుకొని జీవిస్తున్నారన్నారు.ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. కార్పొరేట్ యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందన్న అనుమానం ఉందని ఆరోపించారు.అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల ప్రైవేట్ విద్య సంస్థలలో సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్నారు.వాళ్లందరికీ పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలి. లేకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జో ఓ 45 లో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఫీజు లు వసూలు చేయవద్దని ఉంది. దాన్ని మద్దతు ఇస్తున్నాము. కానీ గత రెండేళ్ల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు కళాశాలకు ఇస్తే కాలేజీలకు ఉపశమనం ఉంటుంది. Ap ప్రభుత్వం 4,500 కోట్లు ఇచ్చింది. ఆ రాష్ట్రం కంటే మనం ధనిక రాష్ట్రం కాబట్టి వెంటనే విడుదల చేయాలి.ప్రైవేట్ పాఠశాలలో 4 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు ఇవ్వడంలేదు. రెండు కేటగిరిలుగా ప్రైవేట్ పాఠశాలలను విభజించి కార్పొరేట్, ఇంటర్ నేషనల్ స్కూల్ ఒక కేటగిరి గా ఉపాధి, ఉద్యోగాల కోసం స్కూల్ పేట్టుకొన్న స్కూల్ ను ఒక కేటగిరి గా చేయాలి. రెండో కేటగిరి స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి. మొదటి కేటగిరి స్కూల్ లో యాజమాన్యం జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని,ఇంటర్, డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు మెస్ చార్జీలు 500 రూపాయలు 10 నెలల కోసం కాకుండా 12 నెలలకు ఇవ్వాలని వంశీ చంద్ డిమాండ్ చేశారు.

Related Posts