YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ట్రునాట్ ద్వారా కరోనా పరీక్షలు

ట్రునాట్ ద్వారా కరోనా పరీక్షలు

ట్రునాట్ ద్వారా కరోనా పరీక్షలు
కాకినాడ, మే 20
కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జిల్లాలో వేగం కానున్నాయి. వైరాలజీ ల్యాబ్‌ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ట్రూనాట్‌ యంత్రాలపై ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఆ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే కోవిడ్‌-19 ఆస్పత్రి జెమ్స్‌లో 15 యాంత్రాలను పరీక్షల కోసం సిద్ధంగా ఉంచారు. పాతపట్నంలో మరో నాలుగు యంత్రాలను పరీక్షలకు సిద్ధం చేశారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో యంత్రం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు అనుమానితులను రోజుల తరబడి క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి వైద్యుల బృందం వారి స్వాబ్‌ తీసి ప్రయోగశాలకు పంపేది. ఆ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు అనుమానితులను ఆయా కేంద్రాలకే పరిమితం చేసేవారు. ఇకపై అలా వేచి చూడాల్సిన పనిలేదు. ఎంపిక చేసిన ఆస్పత్రులకు వైరస్‌ అనుమానితులు వచ్చి ఇట్టే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ట్రూనాట్‌ యంత్రాలను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం జిల్లాకు 20 మిషన్లను, వ్యాధి నిర్ధారణ కిట్లను పంపింది. వాటితో ఇకపై పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇకమీదట అనుమానితుల స్వాబ్‌ను ప్రయోగశాలకు పంపకుండా ఇక్కడ పరీక్షల్లోనే ఫలితాలు తెలుసుకునేలా 'ట్రూనాట్‌' మిషన్లు బాగా ఉపయోగపడతాయని అధికారులు చెప్తున్నారు.కాకినాడలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ప్రయోగశాలలో ప్రతి నిత్యం అనుమానితుల నుంచి సేకరించిన స్వాబ్‌లను వ్యాధి నిర్ధారణ పరీక్షలు పంపాల్సి వచ్చేది. స్వాబ్‌ను తరచూ తీసుకెళ్లేందుకు, వాటి నివేదికలు రప్పించేందుకు శ్రమపడాల్సి వచ్చేది. ఈ ప్రయోగశాలలో రోజుకు 200 మందికే పరీక్షలు సాధ్యపడేది. అందువల్ల నివేదికలు రావడంలో జాప్యం జరిగేది. రోజురోజుకూ అనుమానితుల సంఖ్య పెరిగిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం వల్ల సత్వర పరీక్షల నిర్వహణకు ట్రూనాట్‌ యంత్రాలను వైద్య ఆరోగ్యశాఖ వినియోగించేందుకు నిర్ణయించింది.ట్రూనాట్‌ యంత్రాల ద్వారా రోజుకు 400 మందికి పరీక్షలు జరిపేందుకు అవకాశం ఉంది. ఒక్కో యంత్రంపై రోజుకు 20 మందికి తక్కువలేకుండా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ పరికరాలపై ప్రిజంప్టివ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అవుతుంది. అంటే కరోనా లక్షణాలు ఉన్నాయని ఆ మిషన్‌ తెలియజేస్తుంది. ఇలా వచ్చిన ఫలితాలను చివరకు వైరాలజీ ల్యాబ్‌కు పంపి నిర్ధారించుకుంటారు. ఇప్పటివరకు అనుమానిత లక్షణాలు లేకపోయినా విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని తెలిసిన వెంటనే పోలీసు, వైద్య బృందాలు అలాంటి వారిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేసుకునేందుకు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Related Posts