YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తండ్రి బాటలో జగన్

తండ్రి బాటలో జగన్

తండ్రి బాటలో జగన్
విజయవాడ, మే 20
జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ని నూటికి నూరు పాళ్ళూ అనుసరిస్తున్నారు. ఇది అన్ని విషయాల్లోనూ అని తప్పకుండా చెప్పాల్సిందే. తండ్రి అడుగులో అడుగు వేస్తూ జగన్ పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పధకాల విషయంలో చేతికి ఎముక లేనట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఖజానా ఖాళీని కూడా చూసుకోవడంలేదు. ఎవరినీ పట్టించుకోవడంలేదు. తాను చెప్పిన ప్రకారం పందేరాలు ఇవ్వాల్సిందేనని రూల్ పెట్టుకున్నారు. ఆ విధంగానే ముందుకుపోతున్నారు. దాని కోసం భూములను అమ్ముతున్నారు. ఇదిపుడు రాజకీయ రచ్చగా ఉంది. నిజానికి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలు, తటస్థుల్లో కూడా ఇది చర్చగా ఉంది. ప్రభుత్వ భూములు అంటే అచ్చమైన ఆస్తులు వాటిని తెగనమ్మడం అంటే చెడిపోయినట్లేనని ఒప్పుకోవడమేనని అంటున్నారు.ఉమ్మడి ఏపీకి సీఎంగా అయిదున్నర ఏళ్ళు పాలించిన వైఎస్సార్ కూడా భూములను అమ్మకానికి పెట్టారు. అప్పట్లో బంగారం లాంటి హైదరాబాద్ రాజధానిగా ఉంది. పైగా కేంద్రంలో కాంగ్రెస్ సర్కారే ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా వైఎస్సార్ భూములను తెగనమ్మడానికే నాడు మొగ్గు చూపారు. ఆనాడు ఎంతో విలువైన విశాఖ భూములు వందల ఎకరాలు ఇలా ప్రైవేట్ కి దాసోహం అయిపోయాయి. భూములను వరసగా వేలం పాటకు పెట్టారు. విశాఖ నుంచే పదిహేనేళ్ళ క్రితం వేయి కోట్ల రూపాయల ఆదాయాన్ని వైఎస్సార్ కేవలం భూముల అమ్మడం ద్వారానే సేకరించారు. వాటిని కూడా ఆయన సంక్షేమ పధకాలకే వెచ్చించారు.ఇపుడు జగన్ కి వైఎస్సార్ తో పోలిస్తే ఆర్ధికంగా అన్నీ ఇబ్బందులే ఉన్నాయి. కేంద్రం పైసా సాయం చేయదు. విభజన ఏపీలో ఆదాయం పెరగదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అలా ఉన్నాయి. దాంతో జగన్ కూడా భూములనే నమ్ముకున్నారని అంటున్నారు. ఇపుడు జగన్ ఉన్న పాటి భూములను కూడా అమ్మేయడానికే నిర్ణయించుకున్నారు. దాని వల్ల 250 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించాలని జగన్ భావిస్తున్నారు. వీటితో నవరత్నాలకు ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. కానీ జగన్ హామీల విలువ ఏపీ బడ్జెట్లో ఎనభై శాతం పైగా ఖర్చు చేసినా సరిపోదు. ఇలా ఎన్ని భూములు అమ్ముతారు. ఎంతకాలం నిధులు సేకరిస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్న.ఓ విధంగా చూస్తూంటే ఆస్తులు అమ్ముకున్న వారిని చెడిన వారేనని అంటారు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అప్పులు ఉన్నా ఇలా ఏకంగా భూములు అమ్ముకునేటంతగా లేవు. ఇది ఆంధ ప్రదేశ్ ఆర్ధిక అనారోగ్యాన్ని సూచిస్తోందని కూడా అంటున్నారు. ఈ భూముల అమ్మకాలతో పాటు అప్పులు కూడా జగన్ సర్కార్ భారీ ఎత్తున చేస్తోందట. నిజానికి అప్పులు తేవడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. ఆ తెచ్చిన అప్పులతో నిర్మాణాత్మకమైన పధకాలకు ఖర్చు చేస్తున్నారా లేదా అన్నదే చూస్తారు. ఆ విధంగా చూసినపుడు నాడు బాబు నేడు జగన్ ఇద్దరూ కూడా తమ సొంత రాజకీయ అజెండాలను పూర్తి చేసుకోవడానికే అప్పు చేస్తున్నారని అంటారు.అయిదేళ్లలో బాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక ఏడాదిలో జగన్ ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే అయిదేళ్ళు పూర్తి అయ్యేనాటికి జగన్ బాబుని మించి కొత్త రికార్డు సృష్టిస్తారా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. అలాగే భూముల అమ్మకాల్లో వైఎస్సార్నే మించుతారా అని కూడా అంటున్నారు. చూడాలి మరి.

Related Posts