YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అడుగులు...

రాజధాని అడుగులు...

రాజధాని అడుగులు...
విశాఖపట్టణం, మే 20
రాజధాని విభజన బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించి దాదాపు నాలుగు నెలలు కావవస్తుంది. అయితే ఇంతవరకూ దీనిపై సెలక్ట్ కమిటీయే ఏర్పాటు కాలేదు. సెలక్ట్ కమిటీకి పేర్లు సూచించాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్ని పార్టీల నేతలను కోరారు. కానీ అధికార వైసీపీ మాత్రం సెలక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంటూ సభ్యుల పేర్లు ఇవ్వడానికి తిరస్కరిచింది.ఈలోపు అసెంబ్లీ సమావేశమై శాసనమండలిని రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానానికి పంపింది. ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దుకు ఆమోదం తెలపక పోవడంతో మండలి లైవ్ లోనే ఉన్నట్లే. దీంతో మరోసారి శాససనభను ఏర్పాటు చేసి మూడు రాజధానుల బిల్లును ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును శాసనమండలికి పంపి నాలుగు నెలలు గడుస్తుండటంతో అసెంబ్లీలో బిల్లును మరోసారి పెట్టి ఆమోదించుకోవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్య కూడా దాఖలయింది. అయితే బిల్లులు చట్ట సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొనడంతో అందుకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కొంత శాంతించిన వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. జూన్ మూడోవారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది.అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇటీవల స్పీకర్ ఓంబిర్లా పరోక్షంగా పార్లమెంటు సమావేశాలు ఉంటాయని తెలిపారు. జూన్ మూడో వారంలో పార్లమెంటు వర్షకాల సమావేశాలు ఉండే అవకాశముంది. ఈ సమావేశాల్లో శాసనమండలి రద్దు బిల్లును ఉభయసభల్లో ఆమోదింప చేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు కేంద్ర పెద్దలతో కలసి చర్చించేందుకు జూన్ రెండో వారంలో జగన్ ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూన్ నెల చివరి నాటికి ఇటు మూడు రాజధానుల వ్యవహారం, ఇటు శాసనమండలి రద్దు అంశాన్ని తేల్చేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related Posts