YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం విదేశీయం

మిలటరీ గేమ్స్ తో ప్రారంభమైన కరోనా

మిలటరీ గేమ్స్ తో ప్రారంభమైన కరోనా

మిలటరీ గేమ్స్ తో ప్రారంభమైన కరోనా
బీజింగ్, మే 20
కరోనా వైరస్ విషయంలో చైనా వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో అక్టోబర్‌లోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని కొంత మంది వాదిస్తున్నారు. హుబేయి ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో డిసెంబర్‌లో వైరస్ వ్యాప్తి మొదలైందని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో నావెల్‌ కరోనా వైరస్ ఎప్పుడు ఆవిర్భవించింది? ముందు ఎవరికి సోకింది? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో గత ఏడాది అక్టోబర్‌లో వరల్డ్ మిలిటరీ స్పోర్ట్స్ జరిగాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న పలువురు ఆటగాళ్లు తాము కరోనా లక్షణాలను ఎదుర్కొన్నామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.వుహాన్‌లో అక్టోబర్‌లో జరిగిన సైనిక క్రీడల్లో వంద దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారని, కొందరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని వెలుగులోకి వచ్చింది. కొంత మంది పరీక్షలు నిర్వహించుకుంటే కరోనా పాజిటివ్‌‌గా రావడం షాక్‌కు గురిచేస్తోంది.వుహాన్‌లో తొలి కేసు డిసెంబర్లో నమోదైందని చైనా చెబుతోందనీ.. కానీ అక్టోబర్‌లోనే ఆ నగర వీధులన్నీ నిర్జనంగా కనిపించాయని లక్సెంబర్గ్ ట్రయాథ్లెట్ ఒలీవర్ జార్జెస్ అన్నారు. స్థానికులెవరూ బయటకు వెళ్లొద్దని స్థానిక ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వినిపించాయని తెలిపారు. సైనిక క్రీడల్లో పాల్గొన్న కొద్ది రోజుల తర్వాత తనలో జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయని.. అది కరోనా వైరసో, కాదో తెలుసుకునేందుకు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోబోతున్నానని చెప్పారు.జనవరిలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉందని చైనా చెబుతున్నప్పటికీ అక్టోబర్‌లోనే వీధులన్నింటినీ రసాయనాలతో స్ప్రే చేయడం చూశామని తమ అథ్లెట్లు చెప్పారని జార్జెస్ అన్నారు. ఎయిర్‌పోర్టులో తన ఉష్ణోగ్రతను కూడా రికార్డు చేశారని తెలిపారు. బయట నుంచి ఆహారం తీసుకోవద్దని చెప్పారని.. ఆటగాళ్లు క్యాంటీన్‌లో ప్రవేశించి పదేపదే చేతులు శుభ్రం చేసుకున్నారని జార్జెస్ వెల్లడించారు. ఇవన్నీ తనకు ఆశ్చర్యం కలిగించాయని వాపోయారు.వుహాన్‌లో తాము బస చేసిన భవనంలో చాలా మంది కొవిడ్‌-19 లక్షణాలతో అనారోగ్యం పాలయ్యారని ఇటాలియన్‌ ఫెన్సర్‌ టగ్లిలారియోల్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత తన కుమారుడిరి, అతడి ప్రేయసికి కూడా వైరస్ సోకిందని ఆయన చెప్పారు. మిలిటరీ క్రీడల్లో పాల్గొన్న సమయంలోనే తనకు కరోనా వైరస్ సోకిందని ఫ్రెంచ్‌ పెంటాథ్లెట్ ఇలోడి క్షౌవెల్‌ (31) చెప్పడం గమనార్హం. తన భాగస్వామి వాలెంటిన్‌ టెలాడ్‌ (27)కు కూడా కొవిడ్‌-19 సోకిందని ఇలోడి చెప్పారు.తమ దేశస్థులు కూడా కొంత మంది అస్వస్థతకు గురయ్యారని.. అయితే కరోనా పాజిటివ్‌ రాలేదని స్వీడన్‌ పెంటాథ్లెట్ మెలినా వెస్టర్‌బర్గ్ తెలిపారు. అందరూ సురక్షితంగా బయటపడినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ అంశం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుండటంతో మరి కొంత మంది క్రీడాకారులు తమ అనుభవాల గురించి చెబుతున్నారు.తనకు, తన జట్టు సభ్యులకు అక్టోబర్‌లోనే వైరస్ సోకిందని జర్మన్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి జాక్వెలైన్‌ బాక్‌ పేర్కొన్నారు. క్రీడలు జరిగిన కొన్ని రోజుల తర్వాత తమ జట్టులో కొందరు ఆనారోగ్యం బారిన పడ్డారని.. రెండు రోజుల తర్వాత తాను కూడా అస్వస్థతకు గురయ్యానని ఆమె తెలిపారు. తాను ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకు ఆమె తండ్రికి వైరస్ సోకిందని ఆమె చెప్పడం గమనార్హం. ‘నేనెప్పుడూ ఇంతలా అనారోగ్యానికి గురవ్వలేదు. ఇది తీవ్రమైన ఫ్లూ లేదా కొవిడ్‌-19 అయ్యుండాలి. నేనైతే కొవిడ్‌-19 అనుకుంటున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు.కరోనా వైరస్ విషయంలో చైనా తీరు మొదట నుంచే అనుమానాస్పదంగా ఉంది. మొదట అంటువ్యాధి కాదని ప్రపంచ దేశాలను నమ్మించింది. చివరికి దాన్ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా మరణాల విషయంలోనూ చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మిలిటరీ క్రీడాకారుల చెబుతున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Related Posts