YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రోడ్డున పడుతున్న రైతులు

రోడ్డున పడుతున్న రైతులు

రోడ్డున పడుతున్న రైతులు
హైద్రాబాద్, మే 20,
రాష్ట్రంలో మామిడి, బత్తాయి, ఇతర పండ్ల రైతులు రోడ్డునపడ్డరు. పంటను అమ్ముకునేందుకు మార్కెట్ లేక.. కనీస రేటు కూడా రాక లబోదిబోమంటున్నరు. రోడ్డున పడ్డ రైతులుకరోనా ఎఫెక్ట్తో హైదరాబాద్లోని గడ్డి అన్నారం మార్కెట్ను మూసేయడం, శివార్లలోని కోహెడలో మార్కెట్ గాలివానకు కుప్పకూలిపోవడంతో పండ్లు ఎక్కడ అమ్ముకోవాలె అని ఆందోళన పడుతున్నరు. రోడ్ల పక్కనే వెహికల్స్ పెట్టుకుని వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నరు. మరోవైపు వ్యాపారులు ఇదే అదనుగా రైతుల నుంచి తక్కువ ధరకు మామిడి, బత్తాయి, బొప్పాయి కొని.. ఫంక్షన్ హాళ్లలో స్టోర్ చేస్తున్నరు. ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ చేసుకుంటున్నరు. రైతులు మాత్రం గిట్టుబాటు ధర రాక కన్నీళ్లతోనే ఇంటికిపోతున్నరు.రాష్ట్రవ్యాప్తంగా మామిడి, బత్తాయితోపాటు కొందరు సీజనల్ పండ్లను పండిస్తున్నారు. జగిత్యాల, మంచిర్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో మామిడి పంట ఎక్కువ ఉండగా.. నల్గొండ, మరికొన్ని జిల్లాల్లో బత్తాయి సాగు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పండ్ల రైతులు పంటను అమ్ముకునేందుకు ఉన్న ఏకైక మార్కెట్ హైదరాబాద్లోని కొత్తపేటలో ఉన్న గడ్డిఅన్నారం మార్కెట్. ఈసారి పండ్ల స్టాక్ మార్కెట్కు వచ్చే సమయంలోనే కరోనా ఎఫెక్ట్ మొదలైంది. దాంతో మార్కెట్ను కొత్తపేట నుంచి హైదరాబాద్ శివార్లలోని కోహెడ ప్రాంతానికి మార్చారు. నిర్మాణ పనులు పూర్తికాకముందే, ప్రారంభోత్సవం కూడా చేయకుండానే హడావుడిగా గత నెల 27 నుంచి విక్రయాలు ప్రారంభించారు. వారం రోజుల తర్వాత వచ్చిన గాలి వానకు కోహెడలో మార్కెట్  షెడ్లు కుప్పకూలాయి. చాలామంది రైతులు గాయాల పాలయ్యారు. అప్పటికే రోజూ 1,500 టన్నులకుపైగా మామిడి, భారీగా బత్తాయి, ఇతర పండ్లు మార్కెట్కు వస్తున్నాయి. దాంతో షెడ్లు తిరిగికట్టే వరకు అంటూ మార్కెట్‌ను మళ్లీ గడ్డి అన్నారానికి తరలించారు. ఇక వ్యాపారులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు మాస్కులు పెట్టుకోవట్లేదని, లాక్ డౌన్ రూల్స్ పాటించడం లేదని అంటూ 13వ తేదీ నుంచి గడ్డి అన్నారం మార్కెట్ను మళ్లీ మూసేశారు. దీంతో రైతులు పండ్లను ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎక్కడ అమ్ముకోవాలన్నది తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో, శివారు ఏరియాల్లో రోడ్ల పక్కనే పండ్లు అమ్ముతున్నారు.హైదరాబాద్లోని అన్ని ప్రధాన రూట్లలో రైతులు పండ్లు అమ్ముతూ కనిపిస్తున్నరు. మామిడి రైతులే కాకుండా బత్తాయి, బొప్పాయి, ఇతర పండ్ల రైతులదీ ఇదే పరిస్థితి. కరోనా ఎఫెక్ట్‌ తో ఆందోళన వద్దని, కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తామని సర్కారు ప్రకటించినా.. రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కోహెడలోని మార్కెట్ పునర్నిర్మాణం కోసం శనివారం శంకుస్థాపన జరిగినా.. అదెప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది తెలియని పరిస్థితి ఉంది.మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు ఒక టన్ను బత్తాయి అమ్మితే 40 వేలపైన వచ్చేవి. ఇప్పుడు 10 టన్నులు అమ్మినా 40 వేలు వచ్చేటట్టు లెవ్వు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. మార్కెట్లో ఒక పూటలో పంట అమ్ముకుని పోయేటోళ్లం. ఇప్పుడు రోడ్డునపడ్డం. వారం నుంచి కష్టపడుతున్నా పంట అమ్ముకోలే. సర్కారు పండ్ల రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Related Posts