YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కళకళలాడిన ఎలక్ట్రిక్ మార్కెట్

కళకళలాడిన ఎలక్ట్రిక్ మార్కెట్

కళకళలాడిన ఎలక్ట్రిక్ మార్కెట్
హైద్రాబాద్, మే  20,
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సోమవారం నగరంలోని ప్రముఖ మార్కెట్లయిన ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌ మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ వస్తువులను ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో ట్రూప్‌బజార్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్, రాంకోఠి, ఫీల్‌ఖానా, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల ఆటోమొబెల్‌ మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో మొదటి రోజు మార్కెట్‌ కళకళలాడింది. పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందిరాంకోఠి, ట్రూప్‌బజార్, కోఠి బ్యాంక్‌స్ట్రీట్, ఫీల్‌ఖానా మార్కెట్లకు ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర, కార్ల స్పేర్‌పార్ట్స్‌తో పాటు హౌస్‌వైరింగ్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్‌ స్వీచ్‌లు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచి్చన ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం కనిపించింది. అంతేగాకుండా సొంత వాహనాల్లో ఎలాక్ట్రానిక్‌ వస్తువులు పెద్ద ఎత్తున తీసుకు వెళ్తుండటంతో పలుచోట్ల చిన్న ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గూడ్స్‌ ఆటోల రవాణా లేకపోవడంతో కొందరు ప్యాసింజర్‌ ఆటోల్లో వస్తువులను తరలించారు. ఎల్రక్టానిక్‌ దుకాణదారులు, ఆటో మొబైల్‌ దుకాణదారులు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారస్తులకు సొంత మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకున్నారు. షాపుల్లో భౌతికదూరం పాటించేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. షాపు లోపలకు కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తూ, వారు వెళ్లిపోయిన తర్వాతే ఇతరులకు అనుమతి ఇచ్చారు. ఎల్రక్టానిక్, ఆటోమొబైల్‌ వ్యాపారులు సొంతంగా వైబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకుని ఈజీ బైయింగ్, ఈజీ సేల్‌ పద్ధతికి స్వీకారం చుట్టారు. రాష్ట్రంలోనే పేరుపొందిన మార్కెట్లు ఇక్కడ ఉండటంతో వివిధ జిల్లాల నుంచి కేవలం ఆన్‌లైన్‌ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ తీసుకొని టాన్స్‌పోర్టుల ద్వారా డెలివరీ చేస్తున్నారు

Related Posts