YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కంబాల పార్క్

పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కంబాల పార్క్

మూడేళ్ల క్రితం హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో తీవ్రంగా పాడైపోయిన కంబాల కొండ ఏకో పార్క్‌ను ప్రపంచ బ్యాంక్‌ నిధులతో ఆంధ్రప్రదేశ్‌ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్ట్‌ తిరిగి అభివద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్ళుగా అక్కడ సామాజిక అటవీ వన విభాగం ఆధ్వర్యంలో ఓ నర్సరీ నడుస్తోంది. అనేక పూలు, పండ్ల మొక్కల పెంపకం జోరుగా సాగుతోంది. అయితే..! జిల్లా వాసులకు దీని గురించి తెలిసింది తక్కువే. కంబాలకొండకు ఓ మూలన ఉంటూ ఘన చరిత్రను కలిగిన ఈ నర్సరీ ఇక అందరినీ ఆకట్టుకోనుంది. తన అందాలతో పరవశింపజేయనుంది. త్వరలో సందర్శకుల ప్రవేశానికి అధికారులు ప్రణాళికలు రచిస్తుండటమే దీనికి కారణం. ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలకు ఎదురుగా, కంబాలకొండకు ఆనుకొని ఉన్న వనమిత్ర నర్సరీ ఈనాటిది కాదు. ఏళ్ల కాలం నుంచి ఐదు ఎకరాల అటవీ శాఖ స్థలంలో ఇది నడుస్తోంది. ఓ మూలన ఉండటంతో దీని గురించి ఎవరికీ పెద్దగా తెలిసేదికాదు. ఇటీవల జిల్లా అధికారులు దీని అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వివిధ పండ్లు, మొక్కలను గతం కన్నా ఎక్కువగా పెంచారు. వీటిని ప్రజలకు, రైతులకు ఉచితంగానే అందజేసి మన్ననలు పొందారు. ప్రస్తుతం నర్సరీ పెంపకంతో పాటు సందర్శకులకు ప్రవేశం కల్పించి వారిని ఆకట్టుకునేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే దీన్ని మినీ అటవీ పార్కుగా తయారు చేస్తున్నారు. సందర్శకులు చిన్న చిన్న సరదా కార్యక్రమాలు చేపట్టేందుకు మినీ వేదికను సైతం సిద్ధం చేశారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు కల్పించారు. సేదతీరేందుకు కర్రలు, గడ్డితో తయారు చేసిన పగోడాలను, బెంబూ మౌల్డ్స్‌ను, చెట్టు కింద రచ్చబండలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పార్కు ప్రారంభంలో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని ప్రకృతి సిద్ధంగా తయారు చేశారు. అటవీ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సమీపంలోని జూ పార్కుకు, కంబాల కొండకు వచ్చే సందర్శకులు వనమిత్రను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.

Related Posts