YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పాలిటెక్నిక్ కష్టాలు ఇంతింత కాదయా

పాలిటెక్నిక్ కష్టాలు ఇంతింత కాదయా

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అధ్యాపకుల కొరత, సౌకర్యాల లేమి, అతీగతీ లేని ప్రయోగశాలలు వెరసి విద్యార్థుల చదువు అటకెక్కుతోంది. భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలో అవస్థలుపడుతున్నారు.రాష్ట్రంలోని. వీటిలో అత్యధిక కళాశాలలు ఏదో ఒక సమస్యతో సతమవుతున్నాయి. అధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలేజీల్లో దాదాపు 12 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కాంట్రాక్ట్‌ అధ్యాపకులతోనే ఇప్పటికీ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 955 మందికి కళాశాల యాజయాన్య తాగునీరు అందించడంలో అలసత్వ వహిస్తోంది. హాస్టల్‌ నిర్వహణ, విద్యార్థుల తాగునీటి అవసరాలను తీర్చే 150 అడుగులు ఉన్న మోటారు సామర్థ్యం ఎటూ చాలని పరిస్థితి. దీంతో కళాశాల సమీపంలో ఉన్న 180 అడుగుల మేర లోతులో ఉన్న మోటారు ద్వారా నీటిని పంపిణీ చేస్తూ అప్పుడప్పుడు హాస్టల్‌లోని తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న విషయం ప్రిన్సిపల్‌ దృష్టికి రావడంతో 2000 లీటర్ల నీటి సామర్థం గల ట్యాంకర్‌ ద్వారా విద్యార్థులకు, హాస్టల్‌ నిర్వహణకు తాగునీటిని గురువారం సరఫరా చేశారు.బోర్లు మరమ్మతుకు గురైనా వాటిని వినియోగంలో తీసుకొచ్చే పచి చేయడంలేదు. కనీసం తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇదిఇలాఉండగా కళాశాల వసతి గృహంలో 305 మంది విద్యార్థినులు అవస్థలు వర్ణనాతీతం. డే స్కాలర్స్‌ ఇళ్ల వద్దనుంచే బాటిల్స్‌తో తాగునీటిని వెంట తీసుకుని వెళుతున్నారు. అటువంటి డే స్కాలర్సే తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని చెబుతున్నారంటే, హాస్టల్‌ విద్యార్థినులు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. రాష్ట్రం నలుమూలల విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. ప్రధమ, ద్వితియ, తృతీయ ఏడాది పరీక్షలు వరుసగా మార్చి 28 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్‌ 24తో ముగియనున్నాయి. పరీక్షలు సమయంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటే, తరగతులు జరిగే సమయంలో ఈ సమస్య ఇంకెంత తీవ్రంగా ఉంటుందనేది వేరే చెప్పనక్కర్లేదు.1997లో 71 గదులతో కూడిన వసతి గృహ భవనం నిర్మించారు. 71 గదుల్లో 305 నుంచి 350 వరకు విద్యార్థులు ఉంటూ చదువుకుంటారు. వర్షం కురిస్తే గోడలు చెమ్మదేరి ఉంటాయి. ఇప్పటికీ పలు గదులు, కిటికీలు బీటలు వారి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే విద్యారంగం పట్ల, వసతి గృహాల నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్షమే కారణమని చెప్పక తప్పదు. మరోవైపు.. పాలిటెక్నిక్‌ కళాశాలలకు అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.కళాశాల ఆవరణలోనూ, వసతి గృహం వద్ద చెరొక మోటారు ఉంది. ప్రస్తుత వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతున్న మాట వాస్తవమే అయినా ప్రత్యమ్నాయ ఏర్పాటు చేయడంలేదు.

Related Posts