YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి అల్లోల పర్యటన

ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి అల్లోల పర్యటన

ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి అల్లోల పర్యటన
నిర్మల్  మే 20
కరోనా మహమ్మారి నిర్మూలనకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తునన్నాయని, అదే విధంగా ప్రజలు భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మే 31 వరకు వ్యాపారులు, ప్రజలు స్వచ్చందంగా నిబంధనలుపాటించి కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు దోహద పడాలని కోరారు. బుధవారం నిర్మల్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి అల్లోల ఆకస్మికంగా పర్యటించి పలు దుకాణాలు, చికెన్‌షాపులన పరిశీలించారు. నిర్మల్‌ టీ సెంటర్‌ నుంచి నారాయణరెడ్డి మార్కెట్‌, గంగా కాంప్లెక్స్‌, బస్డాండ్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. వ్యాపారులు, ప్రజలు ప్రభుత్వం చెప్పిన మార్గదర్వకాలను పాటిస్తున్నారా? లేదా? అని ఆయన పరిశీలించారు. దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరంపాటించేలా చూడాలని, మాస్కులు ఉన్నవారినే షాపుల్లోకి అనుమతించాలని వ్యాపారులకు సూచించారు.  ప్రజలంతా మాస్కులు ధరించాలని నిబంధనలనుపాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు టిఫిన్స్‌, భోజన సదుపాయం కల్పించేలా బస్డాండ్‌లోని క్యాంటీన్లను, బేకరీలను తెరిచే విధంగా చూడాలని డిఎంను మంత్రి ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలించిన నేపధ్యంలో పట్టణంలోని దుకాణాలను తెరిచారని, ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తున్నామన్నారు. బస్టాండ్‌ను పరిశుభ్రంగా  ఉంచడంతో పాటు ప్రయాణీకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. వ్యాపారులు, ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి బస్టాండ్‌ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ఖానాపూర్‌కు వె ళ్లే బస్సులో ప్రయాణించి కాసేపు ప్రయాణీకులతో ముచ్చటించారు. కొందరు ప్రయాణీకులకు మంత్రి స్వయంగా టికెట్లను అందజేశారు.

Related Posts