నిశ్చితార్థంలో విషాదం..పదిహేనుమందికి కరోనా
హైదరాబాద్ మే 20
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విధించిన లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి ఒక కుటుంబం నిశ్చితార్థం నిర్వహించింది. అతిధులు భారీగా వచ్చారు. ఎవరికి వుందో ఎమో గాని పదిహేనుమంది కరోనా వైరస్ బారిన పడగా ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన దూల్ పేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దూల్‌పేటకు చెందిన ఓ ఫ్యామిలీ గత నెల 11న 300 మంది బంధువులు, స్నేహితులతో వైభవంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించింది. దీంతో వేడుకలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్ విజృంభించింది. దాదాపు 15 మందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పెళ్లికొడుకు తండ్రి కూడా కరోనా బారినపడి మృతి చెందాడు. అధికారులు ఈ వేడుకకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిశ్చితార్థం నిర్వహించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు.