YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యాభై శాతం రిజర్వేషన్లు మించోద్దు

యాభై శాతం రిజర్వేషన్లు మించోద్దు

యాభై శాతం రిజర్వేషన్లు మించోద్దు
న్యూ ఢిల్లీ మే 20
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది.  యాభైశాతం రిజర్వేషన్లు మించొద్దన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.  48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణ జరిపింది.  1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ రామ్మోహన్నాయుడు కోరారు. 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్  యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు వెలువరించింది.

Related Posts