బిహార్ కు తరలిన వలస కూలీలు
అనంతపురంమే 20
ఇన్నాళ్లు పూటగడవక అష్టకష్టాలు పడిన వలస కార్మికులు సొంతూళ్లకు పయణమయ్యారు.ఉపాదికి దూరం నీడ లేని దుస్ధితి ఎదుర్కొని అవస్ధలు పడిన కార్మికులు అధికారుల చోరవతో ముందుకు కదిలారు. అనంతపురం జిల్లా నుంచి బిహార్ వలస కూలీలు సొంతూళ్లకు కదిలారు.అనంతపురం నుంచి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు ప్రత్యేక రైలులో వీళ్లు బయలు దేరారు. .1,552 మంది కూలీలకు ప్రభుత్వం 13 లక్షలకు పైగా నగదును రైల్వేకు చెల్లించింది. కదిరి, తాడిపత్రి, హిందూపురం, లేపాక్షి, పెద్దవడుగూరు, పుట్టపర్తి, రాయదుర్గం, ధర్మవరం.. డోన్ నుంచి కూడా బస్సుల్లో ప్రయాణీకులు అనంత చేరుకున్నారు.అక్కడ నుంచి రైల్వే స్టేషన్ లో సిద్దంగా ఉన్న రైల్ ద్వారా పయణమయ్యారు.