భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణంలు
ఖాట్మాండు మే 20
నేపాల్ ప్రధాని కేపీ ఓలీ..భారత్‌పై తీవ్ర ఆరోపణచలు చేశారు. కాట్మాండులో ఇవాళ పార్లమెంట్‌లో మాట్లాడిన ఆయన భారత్ నుంచి సంక్రమిస్తున్న వైరస్.. చైనా, ఇటలీ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరమైందన్నారు. ఇండియా నుంచి అక్రమ మార్గాల ద్వారా తమ దేశంలోకి వస్తున్న వారి వల్లే కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా.. భారత్ నుంచి జనాల్ని తీసుకువస్తున్న వారి వల్లే వైరస్ కేసులు అధికమైనట్లు చెప్పారు. కొందరు స్థానిక ప్రతినిధులు, పార్టీ నేతలే దీనికి కారణమన్నారు. బయట నుంచి తమ దేశానికి వస్తున్నవారి వల్ల కోవిడ్19ను పకడ్బందీగా నియంత్రించలేకపోతున్నట్లు ప్రధాని ఓలీ తెలిపారు. చైనా, ఇటలీ వైరస్ కన్నా.. భారత వైరస్ ప్రాణాంతకంగా ఉన్నట్లు చెప్పారు. నేపాల్ ప్రధాని వ్యాఖ్యల పట్ల భారతీయ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల మానస సరోవరం కోసం కొత్త మార్గాన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత ఆధీనంలో ఉన్న కాలాపాని-లింపియాదుర-లిపులేక్ ప్రాంతాన్ని కూడా తిరిగి చేజిక్కించుకోనున్నట్లు ప్రధాని ఓలీ తన ప్రసంగంలో తెలిపారు. భారత్, నేపాల్ మధ్య సుమారు 1800 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. లిపులేక్ పాస్ తమకు చెందుతుందని నేపాల్ చెప్పుకుంటున్నది.