YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కష్టాల కడలిలో కౌలురైతులు

కష్టాల కడలిలో కౌలురైతులు

కౌలు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. పంటల కాలం లోని నష్టాల నుండి తేరుకోక ముందే ఖరీఫ్‌ కాలం రానే వచ్చింది. ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా రాష్ట్రంలో కౌలు రైతుల దయనీయ స్థితి కొనసాగుతోంది. తెలుగుదేశం గత ఎన్నికల్లో కౌలు రైతులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు నీటి మీద రాతలుగానే ఉంది. కౌలురైతుల కష్టాలు తీరక సంక్షోభం లో కొట్టుమిట్టాడు తున్నారు. మొక్కజొన్న మాసూళ్లు పూర్తయ్యే దశకు చేరుకున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాత్రం జరగలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు ప్రకటించిన రూ.1425 మద్దతు ధర రైతుకు దక్కడం లేదు. దళారులు క్వింటాకు రూ.1100 చెల్లించడమే గగనంగా మారడంతో బస్తాకు రూ.300కుపైగా రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి లెక్కిస్తే రూ.12 వేలు వరకూ నష్టపోతున్న దుస్థితి ఏర్పడింది. దీంతో మార్కెటింగ్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద అదనపు ధర చెల్లించి ఆదుకోవాలని రైతుసంఘాల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో ఆలోచనలో పడిన ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రూ.200 ఇవ్వాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్కీమ్‌ కింద ఇచ్చే సొమ్ము కౌలురైతులకు అందుతుందా లేదా అనే అనుమానం నెలకొంది. అందుకు ప్రధాన కారణం ఇ-క్రాప్‌ ఆధారంగా స్కీమ్‌ సొమ్మును అందించాలని అధికారులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇ-క్రాప్‌లో భూయజమాని వివరాలు తప్ప కౌలురైతుల పేర్లు కన్పించవు. ఇప్పటికే పండిన పంటను చాలావరకూ కౌలురైతులు వ్యాపారులకు విక్రయించారు. పంట పూర్తవడంతో ఇక ఆ పొలం నుంచి కౌలురైతులు తప్పుకున్నట్లే అవుతోందిరాష్ట్రంలో 24 లక్షల మంది కౌలురైతులు ఉన్నట్లు సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ ఛైర్మన్‌ ఆర్‌.రాధాకృష్ణ కవిూషన్‌ లెక్కలు తేల్చింది. సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. సాగుదారునికి ఆదాయం లేదని ఈ కవిూషన్‌ అధ్యయనంలో వెల్లడైంది. అప్పుల భారంతో కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆహార పంటలు పండిస్తూ ఆహార భద్రతను కాపాడుతున్న కౌలు రైతుల జీవితాలకు భద్రత లేదు. ప్రభుత్వాల భరోసా లేదు.ల్లాలో లక్ష ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగవుతోంది. ఈ సాగులో అత్యధికం కౌలురైతులే ఉన్నారు. మొక్కజొన్న సాగు చేసిన కౌలురైతులు పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద అందించే సొమ్ము కౌలురైతులకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రైతుసంఘాలు కోరుతున్నాయి. ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ అమలు చేస్తున్నామని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. దళారులు మరింత ధర తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మొక్కజొన్న రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. సాగు చేసిన రైతులకే ప్రభుత్వం అందించే స్కీమ్‌ సొమ్ము అందేలా చర్యలు ఉండాలి.

Related Posts