YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో పెరుగుతున్న ఖర్చులు, భారమౌతున్న పనులు...!!

తిరుమలలో పెరుగుతున్న ఖర్చులు, భారమౌతున్న పనులు...!!

తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. తిరుమల, తిరుపతి దేవస్థానం ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఏటా నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోతుంది. అదే నిష్పత్తిలో ఆదాయం పెరుగుదల కనిపించడంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిన 2018-19 వార్షిక బడ్జెట్‌లోనూ అదే విషయం కనిపించింది. అయితే పాలకమండలి, ప్రత్యేకాధికారి ఆమోద ముద్ర లేకుండానే..బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. ఈసారి దేవస్థానం వార్షిక బడ్జెట్‌లో మూడో వంతు జీతాలు, పింఛన్లకే వెచ్చించాల్సి వస్తోంది. శాశ్వత ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగుల పింఛన్లకు భారీగా కేటాయింపులు ఉన్నాయి. మరో వైపు రోజు వారి ఖర్చులతో దేవస్థానానికి ఉన్న ఆదాయ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించడం... దేవస్థానానికి శాపంగా మారుతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి ముందు, వెనుకా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఘాట్‌రోడ్డులో ప్రయాణం..భయం భయంగా చేయాల్సి వస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డును 1945 ఏప్రిల్‌ 10వ తేదీన ప్రారంభించారు. 1973లో తిరుపతి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అయితే రెండేళ్లుగా ఏడు కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు తరచూ కొండ చరియలు కూలుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు హరిణి విశ్రాంతి షెడ్డు వరకు, అక్కడినుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, ఆ తర్వాత నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.5 కిలోమీటర్లు ఉంది. ఇది అతిప్రమాదకరం. ఈ మార్గంలో గతేడాది బ్రహ్మోత్సవాల వేళ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన మరింత తీవ్ర స్థాయిలో జరిగి ఉంటే మొదటి ఘాట్‌రోడ్డును మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటి సందర్భంలో టీటీడీకి ప్రత్యామ్నాయం లింక్‌రోడ్డు మాత్రమే వెసులుబాటు ఉండేది. కానీ లింక్‌రోడ్డు విస్తరణలో ఇంజనీర్లు చొరవ చూపటం లేదనే విమర్శ ఉంది. మొదటి ఘాట్‌లో నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు. భవిష్యత్‌లో అలాంటి ఘటనలు జరిగితే ఈ లింక్‌రోడ్డు ద్వారా భక్తులను తిరపతికి తరలించే అవకాశం ఉంది.ఇందులో లింకురోడ్డు నుంచి తిరుమల వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే కొండ రాళ్లు కూలుతూనే ఉన్నాయి. అక్కడక్కడ చైన్‌లింక్‌ ఫెన్సింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.రెండో ఘాట్‌ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు టీటీడీకి ప్రత్యామ్నాయంగా ఉంది. మూడేళ్లకు ముందు రెండోఘాట్‌లోని 5వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియలతో 20 రోజుల పాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసివేశారు. దీంతో అనేక పనులు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారనే విమర్శ ఉంది.

Related Posts