YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూమెంట్ పాస్ లను జారీ చేసేందుకు కొత్త వెబ్ సైట్

మూమెంట్ పాస్ లను జారీ చేసేందుకు కొత్త వెబ్ సైట్

మూమెంట్ పాస్ లను జారీ చేసేందుకు కొత్త వెబ్ సైట్
న్యూఢిల్లీ, మే 20,
భారత దేశంలో లాక్ డౌన్ 4.0 లోకి ప్రవేశించింది. దీంతో ప్రభుత్వం అనేక సడలింపులను ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ అవసరాలపై ప్రయాణాలు చేయాలనుకునే ప్రజల కోసం మూమెంట్ పాస్ లను జారీ చేసేందుకు కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) చే అభివృద్ధి చేయబడిన ఈ ప్రస్తుతం భారత దేశం అంతటా 17 రాష్ట్రాలకు ఈ-పాస్ సేవలను కలిగి ఉంది. అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసంఈ-పాస్ లు అవసరం. దీని కోసం పైన చెప్పిన వెబ్ సైట్ అభివృద్ధి చేయబడింది. ఇందులో ప్రజలు ఈ-పాస్ ల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు వారి అప్లికేషన్ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు.వెబ్ సైట్ లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అవసరమైన సేవా సంస్థలు, విద్యార్ధులు, యాత్రికులు మరియు అత్యవసర ప్రయాణాల వంటి నిర్ధిష్ట వర్గాలు ఇటువంటి పాస్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి ప్రయాణ అవసరాన్ని ధృవీకరించడానికి తగిన వివరాలతో పాటు రుజువును కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడే పాస్ మంజూరు చేయబడుతుంది.

Related Posts