YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

జూన్ 1 నుండి సుమారు 200 ప్రత్యేక నాన్ ఏసీ రైళ్లు

జూన్ 1 నుండి సుమారు 200 ప్రత్యేక నాన్ ఏసీ రైళ్లు

జూన్ 1 నుండి సుమారు 200 ప్రత్యేక నాన్ ఏసీ రైళ్లు
హైద్రాబాద్, మే 20,
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత దేశంలో విధించిన లాక్ డౌన్ లో 4వ దశ ప్రస్తుతం కొనసాగుతుంది. మే 31తో ఇది పూర్తి కానుంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయాణ పరిమితులపై విధించిన ఆంక్షలను సడలించేందుకు కార్యాచరణ అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్ధులు, యాత్రికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ నుండి వివిధ నగరాలకు 15 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.అయితే ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో భారతీయ రైల్వే మరికొన్ని రైళ్లను అదనంగా నడిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం జూన్ 1 నుండి సుమారు 200 ప్రత్యేక నాన్ ఏసీ రైళ్లు నడవనున్నట్లు తెలుస్తుంది. వీటి ద్వారా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు ఇతర ప్రయాణికులను కూడా వివిధ గమ్యస్థానాలకు చేర్చనున్నారు.ఈ నాన్ ఏసీ రైళ్లలో సెకండ్ క్లాస్ కోచ్ లు మాత్రమే ఉంటాయి. ప్రతి రోజూ నడుస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లు, ఢిల్లీ నుండి నడుస్తున్న ఏసీ స్పెషల్ రైళ్లతో పాటు ఇవి కూడా నడవనున్నాయి. కొత్త రైళ్లను ప్రతి రోజూ నడిపే విధంగా రైల్వే శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అంతే కాదు ఈ రైళ్లలో సీట్లను అన్ని వర్గాల ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం కోసం మీరు ఐ‌ఆర్‌సి‌టి‌సి వెబ్ సైట్ లో లేదా యాప్ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.లాక్ డౌన్ కారణంగా రైల్వే స్టేషన్ లో టికెట్ బుకింగ్ కౌంటర్లు అన్నీ మూసివేయబడతాయి. మీరు ప్లాట్ ఫామ్ టికెట్ లతో సహా కౌంటర్ నుండి ఎలాంటి టికెట్లను కొనుగోలు చేయడానికి వీలు పడదు. కాబట్టి ఐ‌ఆర్‌సి‌టి‌సి ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ మాత్రమే స్వీకరించబడతాయి. ప్రత్యేక నాన్ ఏసీ రైళ్లకు సంబంధించి టైమ్ టేబుల్ ఇంకా విడుదల కాలేదు. ఇవి భారతదేశం అంతటా చిన్న పట్టణాలు మరియు నగరాలకు నడుస్తాయని స్పష్టంగా తెలుస్తుంది.నివేదికల ప్రకారం సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి నడిచి వెళ్తున్న వలసదారులను గుర్తించడంలో సహాయపడాలని భారత రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అధికారులు వారికి సంబంధించిన వివరాలతో రిజిస్ట్రేషన్ చేసిన తరువాత అందరినీ సమీప మెయిన్ లైన్ రైల్వే స్టేషన్ కు తరలించాల్సి ఉంటుంది. వలస కార్మికులను వారు ఉన్న చోటనే ఉండమని ప్రభుత్వం కోరుతుంది. వారు ఇంటికి చేరుకోవడంలో పూర్తి సహకారం అందించేందుకు రైల్వే కూడా సిద్ధంగా ఉంది.ప్రస్తుతం ఢిల్లీ నుండి నడుస్తున్న ప్రత్యేక ఏసీ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, అగర్తలా, డిబ్రూఘర్, తిరువనంతపురం, పాట్నా, బిలాస్ పూర్ (ఛత్తీస్ ఘర్), రాంచీ, భువనేశ్వర్, హౌరా, చెన్నై, జమ్మూ తావి తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి

Related Posts