YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హీటెక్కిన నర్సీపట్నం రాజకీయాలు

హీటెక్కిన నర్సీపట్నం రాజకీయాలు

హీటెక్కిన నర్సీపట్నం రాజకీయాలు
విశాఖపట్టణం, మే 20,
రాజ‌కీయాల్లో ఎవ‌రు పైచేయి సాధిస్తార‌నే విష‌యం ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. ఎవ‌రు ముందు వ‌చ్చార‌నే కాదు.. ఎవ‌రు సెన్సేష‌న్స్ క్రియేట్ చేశార‌నేదే పాలిటిక్స్‌లో కీల‌క విష‌యం. రాష్ట్రంలో ఇలాంటి ప‌రిణామాలు చాలానే ఉన్నాయి. గురువును మించిన శిష్యులు, అన్నను మించిన త‌మ్ముళ్లు.. రాజ‌కీయాల్లో కామ‌న్‌గానే క‌నిపిస్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలోనే ఇప్పుడు విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్సీప‌ట్నంలోనూ రాజ‌కీయాలు హీటెక్కాయి. న‌ర్సీపట్నం నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడు సార్లు టీడీపీ విజ‌యం సాధించింది. దీనిలో ఆరుసార్లు ఏకైక నాయ‌కుడు చింత‌కాయ‌ల అయ్యన్నపాత్రుడు విజ‌యం సాధించి రికార్డు సృష్టించారు.టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన అయ్యన్నకు రాజ‌కీయంగా శిష్యులు ఉన్నారు. వీరిలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ ఒక‌రు. వాస్తవానికి ఈయ‌న రాజ‌కీయ ప్రస్థానం అయ్యన్నతోనే ప్రారంభ‌మైంది. టీడీపీలో మొద‌లైన ఈ ప్రస్థానాన్ని గ‌ణేష్ వ్యూహాత్మకంగా జ‌గ‌న్ వైపు మ‌ళ్లించారు. 2014లో ఏకంగా అయ్యన్నపైనే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. పైగా ఇద్దరు కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. గ‌ణేష్ ప్రముఖ సినీ ద‌ర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు స్వయానా త‌మ్ముడు కావ‌డం విశేషం. ఇక 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప తేడాతో ఓడిన గ‌ణేష్ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇలా గురువును మించిన శిష్యుడు అని అనిపించుకున్నారు.ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే గ‌ణేష్ త‌న గురువు అయ్యన్న రాజ‌కీయానికి పూర్తిగా చెక్ పెట్టేస్తున్నారు. గ‌ణేష్ ఎత్తుల‌తో అయ్యన్నకు ఊపిరి స‌ల‌ప‌ని ప‌రిస్థితి. ఇక‌, అయ్యన్న సోద‌రుడు స‌న్యాసి పాత్రుడు ఇటీవ‌ల వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నారు. అయితే, అయ్యన్న త‌న కుమారుడు విజ‌య్ కోసం.. సొంత సోద‌రుడికే అడ్డుపుల్లలు వేయ‌డం ప్రారంభించారు. దీంతో స‌న్యాసి పాత్రుడ‌ును వ్యూహాత్మకంగా ఉమా శంక‌ర్ వైసీపీలోకి లాగేశారు. ఆయ‌న టీడీపీ పాల‌న‌లో మున్సిప‌ల్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. దీంతో టీడీపీ బ‌లం భారీగా ప‌డిపోయింది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాపాప వంటివారు కూడా రేపో మాపో.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.ప్రస్తుతానికి ఆమె టీడీపీలోనే ఉన్నా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పైగా ఆమె వియ్యంకుడు మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ కావ‌డంతో ఆమె వైసీపీ ఎంట్రీ ద‌గ్గర్లోనే ఉందంటున్నారు. దీంతో ఇక్కడ అయ్యన్న వార‌సత్వంపై పెద్దగా ప్రభావం చూపించే ప‌రిణామాలు ఏవీ కూడా టీడీపీలో జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక అయ్యన్న కుమారుడు విజ‌య్ పాత్రుడు గ‌ణేష్‌కు ఏ మాత్రం పోటీ ఇచ్చే నేత కాదంటున్నారు. వ్యక్తిగ‌త వివాదాలు కూడా ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు మైన‌స్‌గా మారాయి. దీంతో అయ్యన్న త‌న వార‌సుడికి రాజ‌కీయ భ‌విష్యత్తు ఇవ్వాల‌ని చూస్తున్నా న‌ర్సీప‌ట్నంలో సాధ్యం అయ్యే ఆ ప‌రిస్థితులు లేవు. మొత్తంగా చూస్తే.. అయ్యన్న శిష్యుడు పెట్ల దూకుడు ముందు గురువు బేర్ అన‌క త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో మ‌రింత మందిని వైసీపీ వైపు తిప్పుకోగ‌లిగితే.. పెట్లకు తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts