YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కేంద్రందా... రాష్ట్ర ప్రభుత్వాల దా తప్పా... విపరీత ధోరణలకు పాల్పడుతున్న పార్టీలు

కేంద్రందా... రాష్ట్ర ప్రభుత్వాల దా తప్పా... విపరీత ధోరణలకు పాల్పడుతున్న పార్టీలు

తెలుగు రాష్ట్రాల్లో పార్టీలే కాదు, ప్రభుత్వాలూ విపరీత ధోరణిని అనుసరిస్తున్నాయి. పార్టీల తరహాలోనే ప్రభుత్వాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాలు తమ ఘనతను చాటుకోవాలనుకోవడం తప్పులేదు. కానీ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేస్తున్నారు. దీర్ఘకాలంలో నష్టం తప్ప. తిమ్మినిబమ్మి చేసి తమ ఏలికలను సంతృప్తి పరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేంద్రప్రభుత్వం మధ్య చోటు చేసుకున్న తాజా సంఘటనలు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ గణాంకాలపై కాగ్ ఇచ్చిన నివేదికలు చాటిచెబుతున్న సత్యమిదే. రెవెన్యూ రంగాల్లోని అనేక అరశాల్లో జరిగిన అవకతవకలను కాగ్‌ (కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌) మరోసారి ఎరడగట్టిరది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూపొరదిరచిన కాగ్‌ నివేదికలు గమనిస్తే ఇదే అర్ధమౌతుంది. ప్రధానంగా రెవెన్యూ శాఖలకు చెరదిన ఆదాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నివేదికల్లో అనేక అంశాలపై ఆక్షేపణలున్నాయి. పన్నులు వసూలు చేయడం, పన్నులను గుర్తించడం, ద్రవ్యలోటు, చేసిన వ్యయంలో అసంబద్ధ విధానాలను కాగ్‌ నివేదికలు వెల్లడించాయి. ద్రవ్య లోటు నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు కాగ్‌ పేర్కొరది. జిఎస్‌డిపిలో మూడు శాతం లోపు మాత్రమే ఉండాల్సిన రుణం ఏకంగా 4.42 శాతం వరకు పెరిగిపోవడాన్ని ఆక్షేపించింది.అధికారమే పరమావధిగా నడిచే పార్టీలు సొంత ప్రయోజనాలకోసం తప్పుడు హామీలు ఇస్తుంటాయి. అధికారంలోకి వచ్చాక , వాటిని నెరవేర్చడమెలాగో తెలియక అయోమయానికి గురవుతుంటాయి. ఎంతోకొంత చేశామనిపించుకోవాలని తంటాలు పడుతుంటాయి. ఇదంతా సాధారణంగా జరిగే తంతే. అసలు సర్కారీ పద్దులే తప్పుల తడకగా మారడం నేటి విచిత్రం.ఆంధ్రప్రదేశ్ చూపుతున్న లెక్కలకు, కేంద్రప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు తీవ్రవ్యత్యాసం కొనసాగుతూ వస్తోంది. బడ్జెట్ లో చూపించాల్సిన అవసరం ఉండదు. కానీ బకాయిలను చెల్లించేంత ఆర్థిక సామర్ధ్యం ఆయా సంస్థలకు ఉండదు. ప్రభుత్వమే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం భారం కనిపించదు. దీనివల్ల సర్కారు అధికారికంగా ప్రభుత్వ ఖజానాకు కొత్త అప్పులు తెచ్చుకోవడానికి ఆటంకాలు ఉండవు. కానీ కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకున్న వేల కోట్ల రూపాయలకు పదిహేను ఇరవై సంవత్సరాల వ్యవధిలో చెల్లించాల్సిన రుణ భారం మాత్రం తడిసిమోపెడవుతుంది. వచ్చే సర్కారుల ఆర్థిక పరిస్థితిపై ఈ ప్రభావం పడుతుంది. ఈ సర్కారు ద్రవ్యక్రమశిక్షణ పాటించకపోతే భవిష్యత్ తరం ఆ బాధ్యతను మోయాల్సి ఉంటుందన్న మాట. అందుకే లెక్కలు సరిచూసుకోమంటోంది కాగ్. అందుకు సిద్దపడకుండా దులపరించుకొంటోంది సర్కారు. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. ఈ తప్పులు కూడా ఆర్థిక స్థితిని నిప్పుల కొలిమిలో కాలుస్తాయి.కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి , రాజకీయంగా టీడీపీ, బీజేపీలు వేరుపడటానికి సైతం ఈ లెక్కలు కొంతవరకూ దోహదం చేశాయి. రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరంలోని రెవిన్యూ లోటు ను భర్తీ చేస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీ విలువ నాలుగువేల కోట్ల రూపాయలుగానే కేంద్రం పద్దులో కనిపిస్తోంది. రాష్ట్రం కనీసం 12 వేల కోట్ల రూపాయలు రావాలంటూ లెక్క చూపుతోంది. నిజానికి కాగ్ , 14 వ ఆర్థికసంఘం 16వేల కోట్లు, 15 వేల కోట్లవరకూ ఉంటుందని అంచనా వేశాయి. చట్టబద్ధమైన , రాజ్యాంగ బద్ధమైన సంస్థలు వేసిన లెక్కల్లోనే తేడాలు ఎందుకొచ్చాయన్న అంశాన్ని ఇప్పటివరకూ ఎవరూ తేల్చిచెప్పడం లేదు. ఎలాగూ రాజకీయానికి పనికొస్తున్నాయి కదా అని టీడీపీ, బీజేపీలు సైతం పట్టించుకోవడం లేదు. విమర్శలు, ఆరోపణలకే పరిమితమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రాకు ఇచ్చేశామన్న వాదన వట్టి డొల్లేనని తేలింది. కేవలం ప్రాజెక్టుల అంచనాలు, అనుమతులను చూపుతూ లెక్క వేశారన్న విషయం ఈమధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చింది. వాస్తవ గణాంకాలు కొంతమేరకు రాజ్యసభలో కేంద్రం బయటపెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకూ గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీకి అదనంగా కేటాయించిన మొత్తం 12 వేల కోట్ల రూపాయలు. వీటికి వినియోగ ధ్రువపత్రాలు ఇవ్వలేదని కేంద్రం చెబుతోంది. అన్నీ ఇచ్చేశామని, అదనపు వినియోగం కూడా చేశామని రాష్ట్రం వాదిస్తోంది. ఈ పేచీ ఇంతవరకూ తేలలేదు. విచిత్రం ఏమిటంటే ఈ లెక్కల చిక్కులు అన్నీ చూసేది అటు ఇటు సివిల్ సర్వీసు అధికారులే. వీరంతా అఖిలభారత సేవలకు చెందినవారే. అయినా లెక్కలెక్కడ తేడా కొడుతున్నాయి? సర్కారుల మనసు తెలుసుకుని గణాంకాల గతి తప్పించడంతోనే తేడాలొచ్చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలే పరిహాసాస్పదమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వాలు సైతం విశ్వసనీయతను కోల్పోతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. కొత్త పథకాలు, అభివృద్ధికార్యక్రమాలు, సంక్షేమపింఛన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. వీటితో ఖజానా వట్టిపోయింది. అప్పుల భారం రెండు రెట్లు పెరిగింది. ఈ నిజాన్ని మాత్రం అంగీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. లెక్కల్లో మాయాజాలంతో అంతా బాగుందనే పిక్చర్ ఇవ్వాలని చూస్తోంది. ఏవో పథకాల్లో లెక్కలు అటూ ఇటూ అయినా ఫర్వాలేదు. కానీ బడ్జెట్ పద్దులనే పక్కదారి పట్టించడం కొత్త సంప్రదాయానికి , చెడు సంకేతాలకు దారి తీస్తోంది. రెవిన్యూలోటులో ఉంది రాష్ట్రం. తెచ్చిన అప్పులను ఆదాయంగా చూపించడం ద్వారా మిగులు రాష్ట్రంగా మార్చేశారంటూ కాగ్ ఎత్తి చూపింది. ప్రతిపక్షాల విమర్శలను పక్కనపెట్టినా ఇటువంటి ఉద్దేశపూర్వక చర్యలు విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. బడ్జెట్ అంటే ఆషామాషీ వ్యవహారంగా మారిపోతుంది. ఇప్పటికే వివిధ కార్పొరేషన్ల రూపంలో రుణాలు తెస్తూ బడ్జెట్ జవాబుదారీ ద్రవ్యనిర్వహణ (ఎఫ్ఆర్ బీఎం) చట్టానికి దొరకకుండా తెలివిగా వ్యవహరించారు. మిషన్ భగీరథ, కాకతీయ, హౌసింగ్ పథకాల నిమిత్తం నలభైవేల కోట్ల రూపాయల పైచిలుకు రుణం తీసుకుంటున్నట్లు అనధికార సమాచారం. సర్కారు పూచీకత్తు మాత్రమే కనిపిస్తుంది. నిధులు ఆయా కార్పొరేషన్ల ఖాతాలో పడతాయి.

Related Posts