YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీకి కరోనా కష్టాలు

ఆర్టీసీకి కరోనా కష్టాలు

ఆర్టీసీకి కరోనా కష్టాలు
హైద్రాబాద్, మే 21,
అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి...కరోనా దెబ్బ పడింది. తెలంగాణ ఆర్టీసీ 2000 కోట్లు అప్పులతో ఉందని, జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం కార్మికుల సంఖ్య తగ్గించడమే మార్గమని ప్రభుత్వం, యాజమాన్యం దాడి చేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా తమ సర్వీసులను విస్తరించాల్సిన ఆర్‌టిసీ తనను తాను తగ్గించుకుంటూ ప్రజలకు క్రమంగా దూరమవుతున్నది. ఒకవైపు ఆర్టీసీలకు మరణశాసనం లాంటి ఎం.వి.యాక్టు చట్ట సవరణను కేంద్రం ముందుకు తెస్తున్నది. పెంచిన పన్నుల వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్‌టీసీపై పడుతున్న భారాన్ని ఇక్కడ గమనించివచ్చు. 2014-15 నుండి 2017-18 ఆర్ధిక సంవత్సరం వరకు 79కోట్ల 60 లక్షల లీటర్లు డీజిల్‌ వినియోగించింది. ఇందుకోసం 4437 కోట్లు ఖర్చుపెడితే అందులో అచ్చంగా డీజిల్‌ రేటు క్రింద 2409 కోట్లు చెల్లించింది. నాలుగేండ్లలో ఎక్సైజ్‌ డ్యూటీ క్రింద కేంద్రానికి చెల్లించింది 1084 కోట్లుకాగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌ రూపంలో చెల్లించింది 943 కోట్లు. వెరసి పన్నుల రూపంలో చెల్లించింది 2027 కోట్లు. డీజిల్‌ ధరతో పన్నులను పోల్చిచూస్తే 84.14శాతం పన్నులు చెల్లించాల్సివచ్చింది. 2014-15లో డీజిల్‌ ధరతో పన్నులను పొల్చిజూస్తే 43శాతంగా ఉంటే 2015-16లో 83శాతానికి, 2016-17లో 127.47శాతానికి, 2017-18 నాటికి 110.69శాతం పన్నుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని పెంచకుండా ఉంటే టీఎస్‌ఆర్‌టీసీకి సుమారు 900 కోట్లు ఖర్చు తగ్గివుండేది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను 22.25శాతం నుండి 27.25శాతానికి పెంచకపోతే 47.17 కోట్లు ఖర్చు తగ్గివుండేది.క్రూడాయిల్‌ ధరలు (బ్యారల్‌కు) 2013-14లో 105.52 డాలర్లు ఉంటే 2014-15లో 84.16, 2015-16లో 46.17, 2016-17లో 47.56, 2017-18లో 49.37 డాలర్లగా ఉన్నది. ధరలు పెంచినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత తగ్గించేందుకు పధకం పన్నారు. ఒకేసారి రూ.4 కాకుండా 15 రోజులకొకసారి ఆ తర్వాత ప్రతీ రోజు ధరలు సమీక్ష పేరుతో రోజుకి 10 పైసలు నుండి 30 పైసలు వరకు పెంచుతున్నారు. ప్రతి రోజూ పెంచుతున్నా ప్రజలకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకని ఇంధన ధరల పెంపుపై ఆందోళనలు తగ్గిపోవడం ఒక ఎత్తయితే, నేడు కేరళ వామపక్ష ప్రభుత్వం మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ ఆర్థిక విధానాలను అనుసరించే ప్రభుత్వాలు కావడం మరో ముఖ్య కారణం. దేశప్రజలకు తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించడం లక్ష్యంతో ''ఆర్టీసీ యాక్టు 1950'' ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం క్రింద అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీసీ ఏర్పడింది. దేశంలో నేడు 53 ఆర్టీసీ సంస్థలు రోజుకి 7 కోట్లమంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ, ఏడాదికి 501 బిలియన్‌ కిలో మిటర్లు బస్సులను నడుపుతూ తమ సేవలందిస్తున్నాయి. ఏడాదికి 320 కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నాయి.

Related Posts