YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శివాలెత్తిన శ్రీ రెడ్డి

శివాలెత్తిన  శ్రీ రెడ్డి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్ణయంపై నటి శ్రీరెడ్డి స్పందించింది. ‘‘నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయలేదు. నాతో నటించేవారిని బ్యాన్ చేస్తామనడం సరికాదు. నన్ను బద్నాం చేయాలని చూస్తున్నారు. తెలుగు ఆర్టిస్టుల మేలు కోసమే నా పోరాటం. ఆర్టిస్టులను తొక్కేసే అధికారం ‘మా’కు లేదు’’ అని మండిపడింది.ప్రజాస్వామ్యంలో నన్ను అంటరానిదానిలా పరిగణిస్తున్నారు. నాతో ఎవరూ నటించొద్దని చెబుతున్నారు. నాకు పబ్లిసిటీ కావాలంటే నేను సినిమాలే చేసుకునేదాన్ని. విప్పుకోవల్సిన అవసరం ఏముంది? నా బట్టలు నేను ఊడదీసుకోలేదు. తెలుగు కళామ్మ తల్లి బట్టలు మీరే ఊడదీశారు. మేం చెప్పినట్లే మీరు వినాల్సిందే అన్నట్లుగా ‘మా’ ప్రవర్తిస్తోంది. నా బతుకు బస్టాండ్ చేశారు. నన్ను కూడా ఆత్మహత్య చేసుకునేలా మహిళలను నా మీద ఉసుగొలుపుతున్నారు’’ అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ ఫై మీడియా లో రచ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా రెండు రోజుల క్రితం ఓ న్యూస్ ఛానల్ లో ఏర్పాటు చేసిన డెబిట్ లో తెలుగు నటీమణులకు అవకాశాలు ఇవ్వక పోతే నడి రోడ్ ఫై బట్టలు విప్పేసి నిరసన తెలుపుతా అంటూ సవాల్ చేసింది. తాజాగా ఇప్పుడు అన్నంత పని చేసేంది.బంజారాహిల్స్ లో నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శనగా కూర్చొంది. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు రంగం లోకి దిగి ఆమెను అరెస్ట్ చేసారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో తెలుగువారికే అవకాశాలు ఇవ్వాలి ..లేకపోతే ఈ ఉద్యమాన్ని జాతీయ ,అంతర్జాతీయంగా తీవ్రతం చేస్తాన‌ని.. తనకు మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ ఇవ్వకుండా తిప్పుతున్నారని ఫిలిం ఛాంబర్ ఎదుట బట్టలు విప్పి అర్ద నగ్న ప్రదర్శన చేసి తన నిరసన తెలిపింది. అయితే ఇదే విష‌యం పై సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వ‌హించ‌గా.. అంటే శ్రీరెడ్డి అలా ఎందుకు చేస్తోంది.. చీప్ ప‌బ్లిసిటీ కోస‌మా లేక అవాకాశాల‌కోస‌మా లేక డ‌బ్బుకోస‌మా అని పోల్ నిర్వ‌హించ‌గా 60 శాతం మంది చీప్ ప‌బ్లిసిటీ కోస‌మే శ్రీ రెడ్డి అలా చేస్తోంద‌ని ఓట్ వేశారు.ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే ‘మా’ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. శ్రీరెడ్డి చేసిన పనికి చిన్న పిల్లలు టీవీ చూడలేని పరిస్థితి ఏర్పడిందని, టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుందని శ్రీకాంత్ చేసిన కామెంట్స్‌పై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘‘చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉత్తరాది హీరోయిన్లను తీసుకొచ్చి మీ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. అప్పుడు సిగ్గుగా లేదా?’’ అని ప్రశ్నించింది. ‘‘పెళ్లయినవారి పక్కన కూర్చొని, వాళ్లపై చేతులు వేసి మూతులు మూతులు నాక్కోడానికి సిగ్గేయట్లేదా? మీరు చేసే సినిమాలు చిన్నపిల్లలు చూసే విధంగా ఉంటున్నాయా? పిల్లలున్నారని ఇప్పుడు గుర్తుకొచ్చిందా?’’ అని శ్రీరెడ్డి పేర్కొంది. మహిళా సంఘాలకు తన దగ్గర ఉన్న ఆధారలను సమర్పిస్తానని శ్రీరెడ్డి తెలిపింది.

Related Posts