YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కర్నూలు, రాయచోటిల్లో టెన్షన్

ఏపీలో  కర్నూలు, రాయచోటిల్లో టెన్షన్

ఏపీలో  కర్నూలు, రాయచోటిల్లో టెన్షన్
కడప, మే 22,
ఏపీలో ఎటువైపు నుంచి కరోనా దాడిచేస్తుందో తెలీక జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 2407 చేరుకున్నాయి కరోనాపాజిటివ్ కేసులు. 24గంటల్లో 68పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు 1639కు చేరుకున్న డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులుగా ఉన్న 715 పాజిటివ్ కేసులున్నాయి. నమోదు అయిన  68 పాజిటివ్ కేసులలో 10 కోయంబేడు మార్కెట్  నుండి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.  వారం రోజుల క్రితం వరకు కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం గ్రీన్ జోన్ ప్రాంతంగా వుంది. కానీ వారం వ్యవధిలోనే రెండు కోవిడ్ 19 కేసులు నమోదు కావడంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం కాస్త ఆరెంజ్ జోన్ నుండి రెడ్ జోన్ వైపు వెళుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజా పరిస్థితులుప్రజల్లో భయం,అధికారుల్లో టెన్షన్ కలిగిస్తున్నాయి. కరోనా నియంత్రణకై ఇటు ప్రజల సహకారం అటు అధికారులు, ఎమ్మెల్యే కృషితో  గత యాబై రోజులుగా నిర్భయంగా ఉన్న ప్రజలు అయిదు రోజుల క్రితం  నియోజకవర్గంలోని సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామంలోని ప్రకాష్ నగర్ కాలనీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవటంతో ఆందోళన ప్రారంభం అయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రజానీకం కలవరపాటుకు గురయింది.  రాయచోటి నియోజక వర్గంలో కరోనా పాజిటివ్ కేసు అని తేలగానే అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. రాయచోటి మున్సిపాలిటీలో మళ్లీ రెండవ కరోనా పాజిటివ్ కేసు బయట పడగానే అధికారులతో పాటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మొదట కరోనా బాధితుడు సంబేపల్లి మండలం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఇతను  వృత్తి రీత్యా  లారీ డ్రైవర్. గత పదిరోజుల క్రితం చెన్నైలోని  కోయంబేడు మార్కెట్ కి వెళ్లి రావడంతో అతనికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు నిర్థారించారు. అప్పట్లో వ్యాధి సోకిన కుటుంబీకులతో పాటు సుమారు వందమంది పైన వ్యాధి అనుమానితులను క్వారెంటీన్‌కు తరలించారు.వారిలో ఇప్పటివరకు యాభై ఒక్క మందికి రిపోర్ట్ రాగా అందరికీ నెగటివ్ వచ్చి ఊరితో పాటుగా నియోజకవర్గం అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 68 ఏళ్ల వృద్ధునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వృద్ధునికి గతంలో టీ.బి తో బాధపడుతూ అప్పుడప్పుడు ఇతను ప్రతి నెలా తిరుపతి కి వెళ్లి చెకప్ చేసుకొని వచ్చేవాడు. ఈ నెల  3,8,15 తేదీలలో తిరుపతి హాస్పిటల్ కు  వెళ్లి వచ్చాడు. తనకు కడుపు నొప్పి ఎక్కువగా వుందని సోమవారం  రాయచోటి తాహసిల్దార్ వద్ద కు వచ్చి హాస్పిటల్ పోవడానికి పర్మిషన్ తీసుకుని తిరుపతి కి వెళ్ళాడు. అక్కడ పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అసలు బయటకు వెళ్లని వృద్ధుడికి కరుణ పాజిటివ్ ఎలా వచ్చిందని అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ వీధి లోని దాదాపు 45 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ని  అధికారులు గుర్తించారు. అందరినీ కడప ఫాతిమా మెడికల్ కాలేజ్‌కి వాహనం ద్వారా తరలించినట్లు డాక్టర్ రాధిక  తెలిపారు. కరోనా వ్యాధి సోకిన వృద్ధుడు పర్మిషన్ కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయం లోనికి వచ్చి వెళ్లడంతో అధికారులతో పాటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Related Posts