YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

రైల్వే ప్లాట్ ఫామే.. ఆస్పత్రి...

రైల్వే ప్లాట్ ఫామే.. ఆస్పత్రి...

రైల్వే ప్లాట్ ఫామే.. ఆస్పత్రి...
పాట్నా, మే 21,
వలస కూలీల పాలిట వరంలా మారిన శ్రామిక్ రైలు.. ఓ మహిళకు మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చింది. శ్రామిక్ రైల్లో సొంతూరికి బయల్దేరిన వలస కార్మికురాలు రైల్లో ప్రయాణిస్తూ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రయాణంలో ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు రాగా.. రైల్లో ప్రయాణిస్తున్న మహిళలు, రైల్వే అధికారులు సాయం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే ప్లాట్‌ఫామ్‌ను ఆస్పత్రిగా మార్చారు. ఆ ప్రత్యేక రైలు.. స్టేషన్‌ను చేరుకునేలోపే ప్లాట్‌ఫామ్‌పై కర్టెయిన్లతో తాత్కాలికంగా ఓ చిన్నపాటి ఆస్పత్రినే ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వారి పర్యవేక్షణలో ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బీహార్‌లోని దనాపూర్‌లో  ఘటన చోటుచేసుకుంది.బిహార్‌లోని సీతామర్హికి చెందిన మొహమ్మద్ అస్లామ్ అన్సారీ (35), మినాజ్ కర్తూన్ (25) దంపతులు పని వెతుక్కుంటూ గుజరాత్‌లోని సూరత్‌కు వలస వచ్చారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు ప్రవేశపెట్టడంతో వారికి ప్రాణం లేచొచ్చింది. సూరత్ నుంచి స్వస్థలానికి బయల్దేరారు.శ్రామిక్ రైలు బిహార్‌లోని దనాపూర్ సమీపానికి చేరుకోగానే కర్తూన్‌కు పురిటినొప్పులు వచ్చాయి. నొప్పులతో ఆమె విలవిల్లాడుతుండగా.. రైల్లో ప్రయాణిస్తున్న ఇతర వలస కుటుంబాలకు చెందిన మహిళలు సాయంగా నిలిచారు. కొంత మంది వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో దనాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై అధికారులు తాత్కాలికంగా కర్టెయిన్టలతో ఓ గదిని ఏర్పాటు చేశారు. రైలు ఆ స్టేషన్‌కు చేరుకోగానే.. బాధిత మహిళను అక్కడికి తరలించారు. వైద్యులు, వలస కూలీల సాయంతో ఆ మహిళ రైల్వే ప్లాట్‌ఫామ్‌ పైనే పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ పూర్తవడం, పండంటి మగబిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారికి రంజాన్ ముందే వచ్చినట్లైంది. బిడ్డ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నామని.. తీరా డెలివరీ సమయానికి లాక్‌డౌన్ రావడంతో ఎలా జరుగుతుందో అని ఆందోళనకు గురయ్యామని అస్లామ్ తెలిపాడు. అల్లా దయతో చివరికి అంతా మంచే జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.బిహార్‌లో సోమవారం ఇలాంటిదే మరో ఘటన జరిగింది. త్రిపురలోని అగర్తల నుంచి బిహార్‌కు శ్రామిక్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ రైల్లోనే ప్రసవించింది. ఆడశిశువుకు జన్మినిచ్చింది. లాక్‌డౌన్ వేళ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మరికొన్ని కదిలిస్తున్నాయి, కంటతడి పెట్టిస్తున్నాయి. అంతా కరోనా మాయ!

Related Posts