YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో రోడ్డెక్కిన బస్సులు

విశాఖలో రోడ్డెక్కిన బస్సులు

విశాఖలో రోడ్డెక్కిన బస్సులు
విశాఖపట్నం మే 21
ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్ డౌన్ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన బస్సులు ... ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో డిపో నుంచి పరుగులు పెట్టాయి. విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు.

Related Posts