YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒడిశా, బెంగాల్ ను కుదిపేసిన అంపన్

ఒడిశా, బెంగాల్ ను కుదిపేసిన అంపన్

ఒడిశా, బెంగాల్ ను కుదిపేసిన అంపన్
12 మంది మృతి...
న్యూఢిల్లీ మే 21, (న్యూస్ పల్స్)
బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ అంపన్ బీభత్సం సృష్టించింది. తీరం దాటడానికి ముందు తీవ్ర తుఫానుగా బలహీనపడినా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను మాత్రం కుదిపేసింది. తుఫాను దెబ్బకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ చిగురుటాకులా వణికిపోయాయి. తీరం దాటిన వేళ గంటకు 110- 190 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులకు తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో 10 నుంచి 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కరోనా కలిగించిన నష్టం కన్నా అంఫాన్ తూపాను నష్టం ఎక్కువేనని ఆమె అన్నారు. దాదాపు లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని ఆమె వెల్లడించారు. షాలిమార్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోనే మరణాలు చోటుచేసుకున్నట్టు సీఎం వివరించారు. నందిగ్రాం, దక్షిణ 24 పరగణాల జిల్లాలు సర్వనాశనమైపోయాయని ఆమె తెలిపారు. ఒడిశాలోనూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొల్ కత్తా నగరంపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. లాక్డౌన్ నిబంధనలు సడలింపులతో దుకాణాలు తెరుచుకోగా.. తుఫాను నేపథ్యంలో వాటిని మూసివేయించారు. అయినా, సరే భారీ నష్టమే వాటిళ్లింది. కొన్ని చోట్ల 22.2 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయింది. కొల్ కత్తా  నగరం సహా పలు జిల్లాల్లో అంధకారం అలముకొంది. కొన్నిచోట్ల ట్రాన్స్ఫార్మర్స్ తగులబడ్డాయి. దీంతో మొబైల్ నెట్వర్క్ కూడా స్తంభించిపోయింది. బెంగాల్, ఒడిశాల్లో ఏడు లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొల్ కత్తా విమానాశ్రయంలో పాక్షికంగా జలమయం అయింది. మరోవైపు,  బలమైన గాలులు, భారీ వర్షాలతో ఒడిశాలోని పరదీప్ రేవు అతలాకుతలమైంది. తుఫాను కారణంగా, భువనేశ్వర్, కొల్ కత్తా నుంచి నడవాల్సిన ప్రత్యేక రైళ్లను రద్దుచేశారు.

Related Posts