లాక్ డౌన్ సమయంలోని కరెంటు బిల్లులను రద్దు చేయాలి
టిడిపి పార్టీ కార్యాలయంలో నిరసనను వ్యక్తం చేసిన నాయకులు
పత్తికొండ మే 21
లాక్ డౌన్ సమయంలోని కరెంటు బిల్లులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెంచిన కరెంటు బిల్లులను తగ్గించి,లాక్ డౌన్ సమయానికి సంబంధించిన రెండు నెలల కరెంటు బిల్లులను రద్దు చేయాలని గురువారం రోజున పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఒక రోజు పాటు నిరసన దీక్షను టిడిపి నాయకులు చేపట్టారు.ఈ నిరసన దీక్షలో భాగంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కరెంటు చార్జీలు పెంచమని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పారని వారు తెలియజేశారు.కరెంటు చార్జీలు పెంచి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తోందని వారు తెలియజేశారు.దాదాపుగా మూడు రెట్లు కరెంటు చార్జీలను పెంచి,పూట గడవక ఇబ్బందిపడుతున్న ప్రజలను మరింత ఇబ్బందులలోకి ప్రభుత్వం నెట్టేసిందని వారు తెలియజేశారు. లాక్ డౌన్ పీరియడ్ లోని కరెంటు బిల్లులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, పాత శ్లాబు విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పనులు,తిండి లేక అవస్థలు పడుతున్న ప్రజల నుండి,పెంచిన కరెంటు చార్జీలను వసూలు చేయడం భావ్యం కాదని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శివరాముడు,మనోహర్ చౌదరి, రామానాయుడు,టి.యన్.టి.యు.సి జిల్లా నాయకులు అశోకుమార్ తదితరులు పాల్గొన్నారు.