YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడవాలి

రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడవాలి

రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడవాలి                      
ఆదిలాబాద్ మే 21 
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  వర్ధంతి నిర్వహించడం జరిగింది. గురువారం     స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి గండ్రత్ సుజాత, నివాసంలో రాజీవ్ గాంధీ ఫోటో  పెట్టి ఘనంగా నివాళులు అర్పించి దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు, ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశానికి అందించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని, మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీ దేనని, పంచాయతీ రాజ్ చట్టానికి ప్రాణం పోసి నేరుగా పంచాయతీలకు అధికారాలు బదలాయించి గ్రామీణ పాలన వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు. పంచాయతీరాజ్ చట్టం లోని 73,74 చట్టాలకు సవరణ చేసి గ్రామ స్వరాజ్యం వర్ధిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్న మహానీయుడని కొనియాడారు. 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి భారత జాతి నిర్మాణంలో యువకులకు క్రియాశీలకం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అని గండ్రత్ సుజాత గా  కొనియాడారు. జాతీయ విద్యా విధానం అమలు చేసి అక్షరాస్యత దిశగా దేశాన్ని ముందుకు నడిపిన విద్యా వేత్త అని, ప్రపంచ శాంతికి తన వంతు కృషి చేసి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆదర్శమూర్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ మున్సిపల్ చెర్మెన్ దిగంబర్ రావు పటేల్,మాజీ మార్కెట్ చెర్మెన్ నర్సింగ్ రావు,అంబ కంటి అశోక్,లక్మన్ వెంకట్ రెడ్డి , పొచ్చన్న, సామ రూపేష్ రెడ్డి,వినోద్,నగేష్,కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts