YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

తెలంగాణలో కరోనా వైరస్‌ మృతులు 2.1 శాతం మాత్రమే: మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా వైరస్‌ మృతులు 2.1 శాతం మాత్రమే: మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా వైరస్‌ మృతులు 2.1 శాతం మాత్రమే: మంత్రి ఈటల
హైదరాబాద్‌ మే 21
తెలంగాణలో కరోనా వైరస్‌ సంక్రమించిన వారిలో 2.1 శాతం మంది మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. దేశంలో 3.5 శాతం మంది, అమెరికాలో 6 శాతం మంది చనిపోయారని పేర్కొన్నారు. కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మొబైల్‌ కొవిడ్‌-19 ఐసీయూ వాహనాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.కరోనాతో చనిపోయిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనప్పుడు మున్సిపల్‌ సిబ్బందే దహన సంస్కారాలు చేసిందని గుర్తు చేశారు. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో కూడా కరోనా మృతుల దహన సంస్కారాలను అధికారులే చేశారు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, గాంధీ వైద్యులపై విమర్శలు చేయడం సరికాదు అని మంత్రి అన్నారు. కరోనా వైరస్‌ రాకూడదని.. తీవ్రత ఉండకూడదని కోరుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు వస్తే 14 రోజుల పాటు ఐసోలేషన్‌ చేసి ఆ తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు నెగిటివ్‌ వస్తే.. మళ్లీ 24 గంటల తర్వాత పరీక్ష చేసి నెగిటివ్‌ వస్తే అతన్ని ఇంటికి పంపవచ్చు.

Related Posts