నరబలి యత్నం
చిత్తూరు మే 21
చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.లంకె బిందె, గుప్త నిధుల వేటలోమూగ మహిళను నరబలి ఇవ్వడానికి సిద్ధపడిన ఘటన కలకలం రేపింది.ఓ మహిళ అప్రమత్తం అవ్వడంతో నరబలి యత్నం తప్పింది.గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్ పురం మండలం వడ్డికండ్రిగ గ్రామానికి సమీపంలోని పెద్ద చెరువులో అర్ధరాత్రి సమయంలో సుబ్రమణ్యం అనే వ్యక్తి తన భార్య సరోజమ్మ డబ్బు ఆశ చూపించి నరబలి ఇచ్చేందుకు యత్నించారు.సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ అధునాతన కాలంలో మూఢనమ్మకాలను నమ్మి క్షుద్ర పూజలు చేస్తే లంకె బిందెలు, గుప్త నిధులు దొరుకుతాయనే దురాశతో అన్యం, పుణ్యం ఎరుగని ఒక మూగ మహిళను బలి ఇవ్వడానికి సిద్ధపడిన వైనంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో మరో వ్యక్తి శేషాద్రి వద్ద ఉన్న కత్తిని చూసి భయబ్రాంతులకు గురైన ఆమె అప్రమత్తంతో సంఘటనా స్థలం నుంచి తప్పించుకొని వెళ్లి స్థానికులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.ఈ ఘటనకు కారకులైన శేషాద్రి, సుబ్బమ్మ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.