YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

మే 21ని అంతర్జాతీయ చాయ్‌ దినంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

మే 21ని అంతర్జాతీయ చాయ్‌ దినంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

మే 21ని అంతర్జాతీయ చాయ్‌ దినంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
జెనీవా మే 21
చాయ్‌ చటుక్కునా తాగరా భాయ్‌.. అని సెలవిచ్చారో సినీ కవి. నిజమే చాయ్‌ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చాయ్‌ ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి మే 21ని అంతర్జాతీయ చాయ్‌ దినంగా ప్రకటించింది. ఈ రోజే తొలి చాయ్‌ దినం అయినందున.. చాయ్‌ ప్రియులందరికీ శుభాకాంక్షలు అంటూ యూఎన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.పొద్దున్నే టీ తాగందే మనసంతా అదోలా ఉంటుంది అనే మాటలు చాలా మంది నుంచి వింటుంటాం. క్రీస్తు పూర్వం 2737లో చైనా చక్రవర్తి షెన్‌నంగ్‌ టీని కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన తాగే వేడి నీటి గిన్నెలో తేయాకు పడి దాని నుంచి వచ్చిన టేస్ట్‌ ఆయనకు ఎంతగానో నచ్చడంతో అలా తొలుత చాయ్‌ పుట్టుకొచ్చిందని చరిత్రకారులు చెప్తుంటారు. శతాబ్దాలుగా చాయ్‌ని ఔషధంగా వాడుతూ వస్తున్నారు. రకరకాలుగా తేయాకులను గ్రేడింగ్‌ చేస్తుండటంతో ఎన్నో రకాల టీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. 1904లో వర్జీనియాలో ఐస్‌టీని అందుబాటులోకి తేగా.. 1980 లో అమెరికాలో టీ బ్యాగులు వచ్చాయి. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలుచుకుంటున్నప్పటికీ.. టీ ప్రియులందరికీ తలనొప్పి నుంచి  ఉపశమనం మాత్రం కలుగుతుండటం విశేషం. ఇక హైదరాబాద్‌లో మాత్రం ఇరానీలు  తమ ప్రియమైన చాయ్‌ను కానుకగా అందించడంతో అర్ధరాత్రి వరకు ఇక్కడ కెఫేలు తెరుచుకొని టీ ప్రియులను అలరిస్తున్నాయి. హైదరాబాద్‌ ఇరానీ టీ తాగనిదే విదేశీ పర్యాటకులు ఇంటికి వెళ్లరంటే అతిశయోక్తి  కాదేమో! సో.. ఇవాళ తొలి అంతర్జాతీయ చాయ్‌ దినం సందర్భంగా చాయ్‌  ప్రియులందరికీ శుభాకాంక్షలు

Related Posts