YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం విదేశీయం

ఇస్రో అద్భుతం!.. మరో చంద్రుడిని ఆవిష్కరణ

ఇస్రో అద్భుతం!.. మరో చంద్రుడిని ఆవిష్కరణ

ఇస్రో అద్భుతం!.. మరో చంద్రుడిని ఆవిష్కరణ
న్యూ ఢిల్లీ మే 21
అంతరిక్ష రంగంలో భారతదేశం సత్తా చాటుతోంది. మొన్న జరిపిన చంద్రయాన్ 2 కొద్దిలో విఫలమైనా అందరి ప్రశంసలు దక్కించుకుంది. అప్పుడు భారత ప్రజల అండ చూసి ఇస్రో కోలుకుని ఆ విఫలం నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త తరహా ప్రయోగాలు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఇస్రో అద్భుతం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసి ఇస్రో అద్భుతం సృష్టించింది. దీనికితోడు ఈ ఆవిష్కరణకు పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి మరో 20ఏళ్ల పాటు ఉంటుంది. ఆ అద్భుతాన్ని సృష్టించిన వారు.. ఇస్రోలోని ఐ.వేణుగోపాల్ ఎస్ఏ.కన్నన్ వి.చంద్రబాబు తో పాటు పెరియార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్. అంబజగన్ ఎస్. అరివళగన్ సీఆర్. పరమశివం ఎం. చిన్నముత్తు ఉన్నారు. వీరితో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లికి చెందిన కే. ముత్తుకుమరన్ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి సమష్టిగా కృత్రిమ చంద్రుడిని ఆవిష్కరించారు.వాస్తవంగా ఈ చంద్రమృత్తికను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని భావించారు. కానీ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో స్వదేశంలోనే తయారుచేయాలని నిర్ణయించి పరిశోధనలు ప్రయోగాలు చేశారు. ఎట్టకేలకు విజయం సాధించారు. దేశీయంగానే చంద్రుడి మీద ఉండే మట్టిని భారత శాస్త్రవేత్తలు తయారు చేసి ఔరా అనిపించారు. భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్లో విక్రమ్ మూన్ లాండర్.. చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్ ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉంటే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో చేయనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా అవసరమవుతుందని భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు

Related Posts