YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టులు

పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టులు

పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టులు
రాజమండ్రి, మే 22,
గోదావరి జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది.  నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ  రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే  ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్‌ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్‌ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు.కాఫర్‌ డ్యామ్‌తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్‌ డ్యామ్‌ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్‌ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్‌కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్‌ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు.

Related Posts