ముందు జాగ్రత్తగా ౩౦ కోట్ల కరోనా వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇఛ్చిన అమెరికా
వ్యాక్సిన్ రాకముందే ముందు జాగ్రత్తగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 30 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డరిచ్చింది. వ్యాక్సిన్ తయారు చేస్తున్న బ్రిటన్-స్వీడన్ బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా (Astrazeneca)తో అమెరికా ఈ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి అమెరికా ప్రభుత్వం 120 కోట్ల డాలర్ల పెట్టుబడి సమకూరింది. టీకా అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా కోసం ఈ సొమ్మును అందించింది. కరోనా వైరస్‌ను అంతమొందించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. నిర్విరామంగా వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోతులపై, ఎలుకలపై విజయవంతం అవుతుండగా.. మనిషి వరకు రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడతగా టీకాలను సరఫరా చేస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది.ఇదిలా ఉండగా, ఆక్స్‌ఫర్డ్ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసే బాధ్యతను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ఈ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే రూ.వెయ్యికే వ్యాక్సిన్ అందజేస్తుందట. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. సీరం కంపెనీని ఆయన తండ్రి సైరస్ పూనావాలా 1966లో స్థాపించారు. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ మానుఫాక్చర్