YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎయిర్ పోర్టులో ముందు జాగ్రత్తలు

ఎయిర్ పోర్టులో ముందు జాగ్రత్తలు

ఎయిర్ పోర్టులో ముందు జాగ్రత్తలు
హైదరాబాద్ మే 22
శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వారి భద్రత దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్టులో  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  విమాన సర్వీసుల కోసం ఎయిర్ పోర్టులో అన్నిరకాల  చర్యలు తీసుకొని ప్రయాణికులకు రక్షణగా అన్ని సర్వీసులు  చేసేందుకు ముందు ఉన్నామని ఎయిర్ పోర్ట్ సీఈఓ ఎస్ జి కే కిషోర్ తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి  కచ్చితంగా మాస్క్ హ్యాండ్ గ్లౌస్ పాటించాలి. ఎయిర్ పోర్టులో కు ఎంట్రీ కాగానే ప్రయాణికులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి శానిటైజర్ ఏర్పాటు చేశారు.  ఎయిర్ పోర్ట్ కు వచ్చిన తర్వాత మొదట కెమెరా ద్వారా  డాక్యుమెంట్ చెకింగ్ పూర్తి చేస్తారు.  డైరెక్టుగా కాంటాక్ట్ లేకుండా కెమెరా ద్వారా ఈ నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చే ప్రయాణీకులు ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రయాణికుల మధ్య కంపల్సరీ డిస్టెన్స్,  ఫ్లైట్ ఎక్కే వరకు కూడా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో కి రాగానే ఎయిర్పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి  వచ్చిన వ్యక్తికి ధర్మకోల్ సీలింగ్ చేసి టెంపరేచర్ నోట్ చేయడం జరుగుతుంది. ఒంటి టెంపరేచర్ ఎక్కువుంటే వారిని  ప్రభుత్వ ఆదేశానుసారం క్వారంటైన్ కి తరలించడం జరుగుతుందని అయన అన్నారు.

Related Posts