YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

పొలంలో ఐదు రోజులున్న బాలింత

పొలంలో ఐదు రోజులున్న బాలింత

పొలంలో ఐదు రోజులున్న బాలింత
అదిలాబాద్ మే 22
కరోనా అనుమానంతో పచ్చి బాలింతను ఊరి బయట చెట్టు కింద ఉంచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రాజులగూడ లో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బొప్పపూర్ పంచాయతీ పరిధిలోని రాజులగూడ గ్రామానికి చెందిన కుడిమెత అనసుయా,  జైతు దంపతులిద్దరు ఉపాధిరిత్య కరీంనగర్ జిల్లాలోని రామడుగు గ్రామంలో కోళ్ళ ఫాంలో పనిచేస్తున్నారు. అనసుయా ఈ నెల 14 వ తేదిన రామడుగు గ్రామంలోని ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  దంపతులిద్దరూ ఆ తరువాతి రోజున ఓ వాహానం ద్వారా ఉట్నూర్ మండలంలోని తమ సొంత గ్రామమైన రాజులగూడ కు చేరుకోగా గత కొద్ది రోజులుగా కరోనాతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు వారు కరీంనగర్ జిల్లా నుండి వస్తున్నారు కాబట్టి కరోనా అనుమానంతో వారిని ఊరి లోపలికి రావొద్దంటు చెప్పారు. దీంతో వారు చేసెదేమి లేక వారి సమీప పోలంలో ఓ చెట్టు కింద గుడారం వేసుకొని ఐదురోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ విషయం గ్రామాలలోకి వచ్చిన  ఎఎన్ఎం లకు తెలిసింది. వెంటనే వారు వైద్యాదికారులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పారు. దాంతో దంపతులను గ్రామంలొకి తమ ఇంటికి తిసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ ఐటిడిఎ పిఓ భావేష్ మిశ్రా, ఏజెన్సీ డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ కుడిమెత మనోహర్ ఆదేశాల మెరకు శుక్రవారం హస్నాపూర్ పిహెచ్ సి వైద్యుడు విజయ్ కుమార్,  తమ వైద్య సిబ్బందితో కలిసి రాజులగూడ గ్రామానికి వెళ్లి బాలింతను, బిడ్డను పరిశీలించి వైద్య పరిక్షలు నిర్వహించి ఓ గదిలో క్వాంటైన్ లో ఉండాలని తెలిపారు. ఆపై గ్రామస్తులకు కరోనా పై పలు సలహాలు సూచనలు అందించారు.

Related Posts