చైనా వుహాన్ లో మూతబడ్డ మాంసం మార్కెట్ , అటవీ జంతు వేటపై నిషేధం
ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కేంద్రమైన వుహాన్‌లో 5 సంవత్సరాల పాటు అడవి జంతువుల మాంసం నిషేధించారు.పెరుగుతున్న అంటువ్యాధులు, ఇతర పరిస్థితుల దృష్ట్యా, వుహాన్‌లో అటవీ జంతువులను వేటాడటం, తినడం అధికారికంగా నిషేధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు కొన్ని రోజుల క్రితం వుహాన్‌లో మళ్లీ కనిపించడం ప్రారంభించింది. అసలు సంగతి ఏంటంటే రెండో సారి కూడా చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్ నుంచే వ్యాపించింది, ఇక్కడే గబ్బిలాలతో సహా అనేక జంతువుల మాంసం అమ్ముతారు. అయితే కరోనా వైరస్ గబ్బిలాలు, ఎలుకల ద్వారా మానవులలోకి వచ్చిందనే అనుమానం అంతర్జాతీయ సమాజంలో ఉంది. 'బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ' ప్రకారం, అనేక శాస్త్రీయ పరిశోధనలఅదే సమయంలో, చైనాలోని అత్యున్నత శాసనసభ కమిటీ తరువాత చైనాలోని అన్ని వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించడంతో పాటు వాటిని ఆహారంగా ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ జంతువుల అమ్మకం, కొనుగోలుపై పూర్తి నిషేధానికి విధించింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఇది ప్రధాన కారణమని నమ్ముతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అసలు కారణం ఏమిటనేది ఇప్పటివరకు ధృవీకరించలేదు. అయినప్పటికీ, ఇది గబ్బిలాలు, పెంగ్విన్లు లేదా ఇతర సారూప్య జంతువుల ద్వారా వ్యాపించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గబ్బిలాలలో వైరస్ ఉద్భవించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గబ్బిలాలు, పాములు, బల్లులు, తోడేలు పిల్లలను చైనా మార్కెట్లలో విక్రయిస్తారు, వీటిని ప్రజలు ఆహారంగా ఉపయోగిస్తారు. చైనాలో ఇప్పటివరకు 82,000 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా 4,634 మంది మరణించారు