YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కొలిక్కిరాని జలవివాదం

కొలిక్కిరాని జలవివాదం

కొలిక్కిరాని జలవివాదం
హైదరాబాద్ 22. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారని ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈనేపథ్యంలో 203 జీఓపై తెలంగాణకున్న అభ్యంతరాలకు వెంటనే వివరణ ఇవ్వాలని, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఏపీ అభ్యంతరాలపై కృష్ణా, గోదావరి బోర్డులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఈ వివాదంలో తెలంగాణకు న్యాయం చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర జలశక్తి మినిష్టర్ కు లేఖ రాశారు. కాంగ్రెస్ నేతలు కృష్ణా బోర్డు చైర్మన్ ను కలిసి 203 జీవో పై ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ కు చెందిన శ్రీనివాస్ అనే రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 203 జీవో కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.ఈ వివాదం రోజు రోజుకు ముదురుతుండడంతో కేంద్ర జల శక్తి శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. నీటి వివాదం పై దృష్టి సారించిన కేంద్రం అత్యవసరంగా కేంద్ర జలశక్తి కార్యదర్శి నేతృత్వంలో సమావేశమై చర్చించింది. వెంటనే రెండు రాష్ట్రాలకు, బోర్డులకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండా కోసం వివరాలు ఇవ్వాలని లేఖలు రాసింది. దీనితో కేంద్రం ఈ వ్యవహారాన్ని నాన్చకుండా ఈ పరిస్థితిని చక్కదిద్దే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం లేఖ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాల అధికారుల తో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈసమావేశం ఎజెండా కోసం కృష్ణా బేసిన్ లో చేపట్టిన ప్రాజెక్టుల డిపిఆర్ లు, టెలిమెట్రి ,బోర్డు నిధుల అంశాల పై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలు ఈనెల 26 లోపు వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ నెలాఖరు లోగా గోదావరి బోర్డు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. బోర్డు సమావేశాల తరువాత రెండు బోర్డులు కేంద్రానికి తమతమ ఎజెండా పంపనున్నాయి.కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ జూన్ రెండో వారంలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలు సామరస్యంగా వ్యవహరించకుండా గొడవ పడుతుండడంతో,ఇరు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీకి ఈ వివాదం అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts