అలెక్స్ హెయిల్స్ మొదటి ఆటకు నాలుగు రోజుల ముందు SRH జట్టులో చేరాడు,SRH నెట్స్లో మొదటిసారిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అలెక్స్ హెయిల్స్ టాప్ ఆర్డర్ వార్నర్ స్థానంలో, ఖచ్చితంగా ఒక స్టార్టర్గా కనిపిస్తాడు. యూసఫ్ పఠాన్ కూడా నెట్స్లో సుదీర్ఘ సెషన్ను కలిగి ఉన్నాడు, పఠాన్ కచ్చితంగా పదకొండు ప్లేయర్స్ లలో ఆడే ఆటగాడిగా ఉన్నాడు.
రాయల్స్ జట్టు సన్ రైజర్స్ జట్టుతో 4 -3 తేడాతో తలపడింది. అయితే,హోమ్ గ్రౌండ్ లో 30 ఆటల్లో 20 విజయాలు సాధించిన SRH రికార్డు వారికి విశ్వాసం కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ వేదికగా ఆడిన నాలుగు ఆటలలో రెండింటినీ RR గెలిచింది.
SRH టీం:-
అలెక్స్ హెయిల్స్, శిఖర్ ధావన్, కెన్ విల్లియంసన్ (c), మనీష్ పాండే, షకీబ్ అల హాసన్, వృద్ధిమాన్ షా (wk), యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్/బేసిల్ తమ్పి.