YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అర్చకులు, పురోహితులకు తేడా తెలియని వారు దేవాదాయ శాఖ మంత్రా ?

అర్చకులు, పురోహితులకు తేడా తెలియని వారు దేవాదాయ శాఖ మంత్రా ?

అర్చకులు, పురోహితులకు తేడా తెలియని వారు దేవాదాయ శాఖ మంత్రా ?
విజయవాడ మే 22
బ్రాహ్మణుల సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మందికిపైగా ఉన్న పురోహితులందరికీ నెలకు రూ. 5 వేల చొప్పున ఆర్ధికసాయం అందచేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. మన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  విషయానికి వస్తే అర్చకులకు, పురోహితులకు తేడా తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం మన దౌర్భాగ్యం అన్నారు. పురోహితుల బాధను తెలుసుకుని వారికి ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని  జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్  కోరితే బాధ్యత కలిగిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అర్థరహితంగా మాట్లాడడం పద్ధతి కాదు అన్నారు. పవన్ కళ్యాణ్  పై ఏదో ఒకటి మాట్లాడేసి తమ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలని ఆత్రం తప్ప తన అజ్ఞానం బయటపడుతుందని ఆ మంత్రి కి తెలియడం లేదు అని ఎద్దేవా చేశారు. 'ఆలయాల్లో దేవుడికి అర్చనలు, పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు తీర్ధప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించే వారు అర్చకులు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాలు చేసే వారు పురోహితులు. పురం హితం కోరే వారిని పురోహితులు అంటారని కూడా తెలియని దేవాదాయశాఖ మంత్రి మనకి ఉన్నారు' అని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కి రూ. 1000 కోట్లు మంజూరు చేయాలని, ఆ నిధులను పూర్తిగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు. బ్రాహ్మణుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. శుక్రవారం ఉదయం విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  మహేష్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ మూడు నెలలతో పాటు మే 24 నుంచి మరో రెండు నెలలు అధికమాసం, మూఢం ఉన్నాయి. ఈ ఐదారు నెలల కాలానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  పురోహితులు అందరికీ నెలకు రూ. 5 వేలు  చొప్పున చెల్లించాలి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బ్రాహ్మణులకు మంజూరు చేసే పెన్షన్లను జనరల్ పెన్షన్లుగా చూపుతున్నారు. నిధులు మాత్రం బ్రాహ్మణ కార్పోరేషన్ నుంచి విడుదల చేస్తున్నారు. భారతీ స్కీం కింద పేద బ్రాహ్మణ విద్యార్ధులకు ఇచ్చే ఉపకార వేతనాలను అమ్మ ఒడిలో కలిపేశారు. గరుడ పథకం కింద పేద బ్రాహ్మణ కుటుంబాల్లో చనిపోయిన వారికి అందచేసే రూ.15 వేల తక్షణ సాయం సక్రమంగా ఇచ్చింది లేదు. పేద బ్రాహ్మణ విద్యార్ధినీవిద్యార్ధులకు ప్రోత్సాహక సబ్సిడీ రుణాల మంజూరు నిలిపివేశారు. వైసీపీ ప్రభుత్వ బ్రాహ్మణ కార్పోరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ కి కేటాయించాల్సిన రూ. 1000 కోట్లను రూ. 100 కోట్లకు తగ్గించినా చైర్మన్ మల్లాది విష్ణు  మౌనం వహిస్తున్నారు. ఇది పూర్తిగా బ్రాహ్మణుల అభివృద్ధిని నిర్వీర్యం చేసే కార్యక్రమమేని విమర్శించారు.

Related Posts