YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా
న్యూఢిల్లీ మే 22
భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 5వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  గడచిన 24గంటల్లో అత్యధికంగా 6088 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి.  దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,18,447కి చేరింది. వీరిలో నిన్న ఒక్కరోజే 148మంది మృత్యువాతపడడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3583కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 48,534మంది కోలుకోగా మరో 66,330మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 2.94శాతం మందికి అత్యవసర విభాగంలో(ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో కొవిడ్ బాధితుల్లో రికవరీ రేటు దాదాపు 40శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మరణాల రేటు సరాసరి 6.65శాతం ఉండగా భారత్లో 3.06శాతంగా ఉంది. కరోనా సోకి మరణిస్తున్న వారిలో దాదాపు 64శాతం పురుషులే ఉండగా 36శాతం మహిళలు ఉన్నారు.  ఇదిలాఉంటే, కరోనా తీవ్రత పెరగడంతో దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా భారీ స్థాయిలోనే జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 555 టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా ఇప్పటివరకు 26లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.  గతకొన్ని రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Related Posts