సింహాచలం ఆక్రమ కట్టడాలను తొలగించాలి
విశాఖపట్నం మే 22
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ పలు రంగాల అభివృద్దికి దోహదపడుతుందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి కేంధ్రం తన వంతు కృషిని అందిస్తుందని చెప్పారు. 5550 కోట్ల రూపాయలను కోవిడ్ కోసం ఇవ్వడం జరిగిందని, లాక్ డౌన్ కారణం గా ఇబ్బంది పడుతున్న సామాన్యులను ఆదుకోవడం కోసం జన్ ధన్ ఖాతాలలో నెలకు 500రూపాయలను జమ చెయ్యడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఆస్తులు అమ్మి నవరత్నాలు పధకాలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత తొమ్మిది నెలలు నుంచి రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ లో నడుస్తుందని చెప్పారు. ఎల్ జి పాలిమర్స్ ప్రమాదం లో యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన ... సింహాచలం భూముల అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కోరారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వైద్యులు సుధాకర్ లాంటి వ్యక్తులు ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కోంటున్నారని చెప్పారు.