YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రైతు బతకాలి

రైతు బతకాలి

రైతు బతకాలి
 హైదరాబాద్ మే 22(
పటాన్ చెరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  ఆర్థిక మంత్రి హరీష్ రావు,  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇతరులు పాల్గోన్నారు. మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ రైతు బతికితే రాజ్యం బతుకుతుంది.  ఒక్క రైతు వ్యవసాయం చేస్తే దాని చుట్టూ ఆధారపడిన వందమంది బతుకుతార.  అందుకే రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్   పనిచేస్తున్నారు.  గత ప్రభుత్వాల హయాంలో వానాకాలంలో చెరువులలో బర్లకు, గొర్లకు నీళ్లు లేని దుస్థితి వుంది.  ఇప్పుడు మండు వేసవిలో చెరువులు అలుగులు పారుతున్నాయి.  విపక్షాలు చెబితే కేసీఆర్ గారు నీళ్లు ఇయ్యలే, కరంటు సరఫరా చేయలే, రైతుబంధు, రైతుభీమా పథకాలు పెట్టలే.  విపక్షాల గుడ్డి వ్యతిరేకతను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.  నగరం చుట్టూ నాలుగు పెద్ద మార్కెట్లు.. అవకాశాన్ని బట్టి ఔటర్ కు బయట .. ఔటర్ కు లోపల.  ఆరేళ్లక్రితం తిండిగింజల కోసం తండ్లాడిన తెలంగాణ ఇప్పుడు పండిన పంటలను దాచుకునేందుకు స్థలాలు వెతికే పరిస్థితి ఏర్పడింది.  వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు.  కాళేశ్వరం మూడో దశ, పాలమూరు రంగారెడ్డి పూర్తయితే పండే పంటలను ఎక్కడ దాచిపెట్టాలి.  ఈసారి యాసంగిలోనే 39.40 లక్షల ఎకరాలలో వరి సాగయ్యింది.  కరోనా విపత్తు నేపథ్యంలో రైతుల పంటల కొనుగోలుకు అనుమతించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  కేసీఆర్  ఆలోచనను చూసి కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పంటల కొనుగోళ్లలో మినహాయింపు ఇచ్చింది.  పంటలు దాచుకునేందుకు మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం జరుగుతోంది.  ప్రజల అవసరాలను అధ్యయనం చేసిన నివేదిక ప్రకారం నియంత్రిత పంటల సాగుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది.  రైతులకు దిగుబడితో పాటు ఆదాయం పెరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.  కోహెడలో 170 ఎకరాల మార్కెట్ లో పండ్లు, కూరగాయలతో పాటు ఇతర సరుకులు దొరుకుతుంది.  ప్రజల అవసరాలను గమనించి సమీకృత మార్కెట్ల ఏర్పాట్లను యోచిస్తుంది.  మార్కెటింగ్ వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు రావాలి.  మారుతున్న పరిస్థితులను రైతాంగం, ట్రేడర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు గుర్తించాలి.   సాంప్రదాయ మార్కెటింగ్ కొనసాగుతున్నా వ్వవస్థలోనూతన ఆవిష్కరణలపై మన అధ్యయనం ఉండాలి.  కరోనా విపత్తు మనకు కొత్తపాఠాలు నేర్పుతుంది.  రేపు ప్రపంచ మార్కెట్ ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియని పరిస్థితి వుంది.  ఆన్ లైన్ లో ఆర్డరిస్తే ఇంటిదగ్గరకే పండ్లు, కూరగాయలు నిత్యావసర వస్తువులు వస్తున్నాయి.  ఆన్ లైన్ మార్కెట్ వ్యవస్థపై మార్కెటింగ్ శాఖ కసరత్తు చేయాలని మంత్రి అన్నారు. ఆర్థికమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ - పదవులు రావడం గొప్ప కాదు .. ప్రజలకు సేవ చేయడం గొప్ప.  రైతు బాగుపడాలి .. వ్యవసాయం లాభసాటి కావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్  నూతన వ్యవసాయ విధానం తెస్తున్నారు.  వారి ఆశాయాలు, లక్ష్యాలకు అనుగుణంగా మనం పనిచేయాలి.  మారుమూల నారాయణఖేడ్ లో మార్కెట్ పెట్టిన ఘనత టీఆర్ఎస్ దే.  నూతన చైర్మన్లు, సభ్యులకు అభినందనలు.  ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు.

Related Posts