YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత్ పై పాక్ మిడతల దాడి

భారత్ పై పాక్ మిడతల దాడి

భారత్ పై పాక్ మిడతల దాడి
న్యూఢిల్లీ, మే 22,
ట్లాది మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలో పంట నష్టం కలిగిస్తోంది. గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువగా మిడతల దండు దాడి చేస్తుండటం గమనార్హం.పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి కోట్లాది మిడతలు భారత భూభాగంపైకి దండెత్తి వస్తున్నాయి. నల్లటి మేఘంలా విరుచుకపడుతున్న మిడతల దండు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పంటల్ని నాశనం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించిన ఈ మిడతల దండు.. పత్తి, కూరగాయలతోపాటు ఇతర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తోంది. పాకిస్థాన్‌ నుంచి వస్తోన్న మిడతల వల్ల రాజస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.వాస్తవానికి ఏటా జూన్-జూలై నెలల్లో మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈసారి ముందుగానే రావడంతో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ మిడతల దండు మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లోకి కూడా ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది.మిడత వల్ల గతేడాది రాజస్థాన్‌లో 6.7 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మిడతల వల్ల 2019లో వెయ్యి కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రాజస్థాన్ ప్రభుత్వం అంచనా వేసింది. మిడతల దండును కట్టడి చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న రాజస్థాన్.. ఈ కీటకాలను నియంత్రించండానికి డ్రోన్లను సమకూర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. జైపూర్‌ను దాటేసిన మిడతల దండు ఢిల్లీ దిశగా వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.రాజస్థాన్‌లో వ్యవసాయ భూములు ప్రస్తుతం చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. హర్యానా వైపుగా మిడతలు పయనిస్తున్నాయి. జైసల్మేర్ ప్రాంతం గుండా మిడతలు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వరకు వ్యాపించాయి. గుజరాత్‌లోని బనస్కథ ఏరియా కూడా మిడతల దాడికి గురైంది. రాజస్థాన్‌లోనే మిడతలను నిలువరించలేకపోతే.. వారం రోజుల్లో ఢిల్లీకి చేరుకుంటాయని రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు నాయకుడు హెచ్చరించారు.మధ్య ఆసియాలోని వాతావరణ పరిస్థితుల కారణంగా మిడతలు అంతర్జాతీయ సమస్యగా పరిణమించాయి. తూర్పు ఆఫ్రికా, ఇరాన్, పాకిస్థాన్, భారత్‌లకు మిడతలతో ముప్పు పొంచి ఉంది. 2019లో వచ్చిన మిడతల గుంపుల కంటే మూడింతలు పెద్ద మిడతల దండు రాజస్థాన్‌లోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Related Posts