YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కరోనాతో 4 లక్షల మంది నిరుద్యోగులు

కరోనాతో  4 లక్షల మంది నిరుద్యోగులు

కరోనాతో  4 లక్షల మంది నిరుద్యోగులు
న్యూయార్క్, మే 22
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. కరోనా సృష్టించిన సునామీతో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు కరోనా బాధితులతో పాటు, మరణాలతో కంగారెత్తిపోతోంది. మరోవైపు ఉద్యోగాల కోతతో అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అమెరికాలో గడిచిన రెండు నెలల్లో సుమారు 39 మిలియన్ల (3.9 కోట్ల) మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంటే అమెరికాలో ఉద్యోగాల కోత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమీప భవిష్యత్తులో ఈ నిరుద్యోగ రేటు భారీగా పెరుగుతుందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సేయింట్‌ లూయిస్‌ వెల్లడించింది.నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని, దీని కారణంగా 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోతారని చెప్పింది. మే చివరి నాటికి లేదా జూన్‌లో నిరుద్యోగ శాతం 20-25కు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది.కరోనా సమస్య మొదలైన తర్వాత వరుసగా తొమ్మిదో వారం కూడా లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ కార్మికశాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

Related Posts